Wednesday, December 7, 2022
Wednesday, December 7, 2022

ఏ క్షణమైనా పెట్రో మంటలు

రూ.15 పిండుకునేందుకు చమురు సంస్థలు రెడీ
రోజుకు 50 పైసలు ఉండవచ్చని పరిశ్రమ వర్గాల అభిప్రాయం

న్యూదిల్లీ: అందరూ ఊహించినట్లుగానే ఈ వారమే ఇంధన ధరలు పెంచడానికి రంగం సిద్ధమైంది. ఓవైపు ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌ పూర్తికావడం, మరోవైపు రష్యాఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధర పెరిగిందన్న సాకుతో పెట్రోలు, డీజిలు, గ్యాస్‌ ధరలు పెంచడానికి చమురు కంపెనీలు సమాయత్తమయ్యాయి. ఉత్తరప్రదేశ్‌ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన నాటి నుంచి నాలుగు మాసాలుగా ఇంధన ధరల్లో మార్పు లేదు. ఆ నష్టాలు పూడ్చుకోవడానికి చమురు కంపెనీలు రంగం సిద్ధం చేసుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ ధర 140 డాలర్లకు పెరగటాన్ని సాకుగా చూపిస్తున్నాయి. ఆదివారం సాయంత్రానికి అమెరికాలో బ్యారెల్‌ చమురు ధర 130.50 డాలర్లకు చేరింది. 2008 జులై 8 నుంచి ఇదే అత్యధిక ధర. అంతర్జాతీయ మార్కెట్‌లో 139.13 డాలర్లకు చేరింది. వీటితో పాటు రూపాయి విలువ సోమవారం రూ.76.98కి క్షీణించింది. భారతదేశం 85శాతం చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. దీంతో ఆసియాలోనే చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రపంచమార్కెట్‌లో చమురు ధరలు పెరగడం, రూపాయి విలువ క్షీణించడంతో ఇంధన ధరలు పెరుగుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను సైతం చిన్నాభిన్నం చేస్తోంది. ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం కష్టంగా మారడంతో పాటు ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదం ఉంది. పెట్రోలు, డీజిలు ధర లీటరుకు రూ.15 పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు వెల్లడిరచాయి. 2017 నుంచి అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల పెరుగుదలకు అనుగుణంగా రోజువారీ ఇంధన ధరలు పెరుగుతున్నాయి. అయితే, 2021 నవంబరు 4వ తేదీ నుంచి చమురు ధరల పెంపు ఆగింది. మార్చి 1వ తేదీ నుంచి బ్యారెల్‌ 111 డాలర్లతో భారత్‌ కొనుగోలు చేస్తోందని చమురు మంత్రిత్వశాఖలోని పెట్రోలియం ప్లానింగ్‌, అనాలిసిస్‌ సెల్‌(పీపీఏసీ) తెలిపింది. నాలుగు మాసాల క్రితం పెట్రోలు, డీజిలు ధరల పెంపును నిలిపివేసే సమయానికి సరాసరిని బ్యారెల్‌ ముడిచమురు ధర 81.5డాలర్లు పలికింది. సోమవారం చివరి దశ పోలింగ్‌ పూర్తికావడంతో చమురు కంపెనీలకు రోజువారీ ధరల సవరణకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తుందని పరిశ్రమ అధికారులు తెలిపారు. అయితే, ఇప్పటి వరకు నష్టపోయిన మొత్తాన్ని ఒక్కసారే పిండుకోవాలని చమురు సంస్థలు భావించడం లేదని, ప్రతిరోజు 50 పైసలకు తగ్గకుండా ధర పెంచవచ్చని పేర్కొన్నాయి. రష్యాఉక్రెయిన్‌ యుద్ధంతో అక్కడి నుంచి రావాల్సిన చమురు, గ్యాస్‌ సరఫరాకు తీవ్ర ఇబ్బంది ఏర్పడిరది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img