ఉక్రెయిన్ మిలటరీ ప్రకటన
రష్యా వైమానిక దాడిని ఉక్రెయిన్ గట్టిగానే ప్రతిఘటిస్తోంది. యుద్ధంలో ఐదు రష్యన్ విమానాలు, ఒక హెలికాప్టరును కూల్చివేసినట్లు ఉక్రెయిన్ మిలటరీ ప్రకటించింది. ‘ప్రశాంతంగా ఉండండి. ఉక్రెయిన్ సైన్యంపై నమ్మకంగా ఉండండి’ అని ఉక్రెయిన్ బలగాలు ప్రకటించాయి. ఉక్రెయిన్‌లోని లుహాన్స్క్ ప్రాంతంలో ఐదు రష్యన్ విమానాలు, ఒక హెలికాప్టర్‌ను కూల్చివేసినట్లు ఆ దేశ మిలటరీ గురువారం తెలిపింది. అయితే విమానాల కూల్చివేతను రష్యా రక్షణ మంత్రిత్వశాఖ ఖండిరచింది. తమ విమానాలేవీ కూలిపోలేదని వెల్లడిరచింది. ఈ వారం ప్రారంభంలో రష్యా గుర్తించిన ఉక్రెయిన్‌లోని వేర్పాటువాద ప్రాంతాల్లో లుహాన్స్క్ ఒకటి. ఉక్రెయిన్ దేశంపై తాము సైనిక చర్య ప్రారంభించినట్లు రష్యాఅధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం టెలివిజన్ ప్రసంగంలో ప్రకటించగానే పలు ప్రాంతాల్లో బాంబుల వర్షం కురిపించింది.