Monday, December 5, 2022
Monday, December 5, 2022

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు : భారీగా ఖర్చు చేసిన పార్టీల్లో బీజేపీ టాప్‌

రూ. 223 కోట్లు ఖర్చు చేసినట్టు ఏడీఆర్‌ నివేదిక
మొత్తం పార్టీల ఖర్చు రూ. 470 కోట్లు
రూ. 102.65 కోట్ల వ్యయంతో కాంగ్రెస్‌ రెండో స్థానం

వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ మొత్తం ఖర్చు చేసింది.ఈ ఏడాది ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, మణిపూర్‌, పంజాబ్‌, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీల కంటే బీజేపీ అత్యధికంగా ఖర్చు పెట్టిన విషయాన్ని అసోసియేషన్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) నివేదించింది. ఈ నివేదిక ప్రకారం రాజకీయ పార్టీలన్నీ కలిపి ఆ ఎన్నికల్లో రూ 470 కోట్లు వెచ్చించగా కేవలం కాషాయ పార్టీయే ఏకంగా రూ 223 కోట్లు ఖర్చు చేసింది. ఇదే సమయంలో బీజేపీకి రూ 914 కోట్ల నిధులు సమకూరాయని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ రూ 102.65 కోట్లు ఖర్చు చేసి జాబితాలో రెండో స్ధానంలో నిలిచిందని ఏడీఆర్‌ నివేదిక తెలిపింది. ఇక బీఎస్పీ రూ 69 కోట్లు ఖర్చు చేయగా యూపీ, ఉత్తరాఖండ్‌, మణిపూర్‌, పంజాబ్‌, గోవా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 13 రాజకీయ పార్టీలకు రూ 1441.7 కోట్ల నిధులు సమకూరాయని ఆయా పార్టీలు మొత్తం రూ 470 కోట్లు ఖర్చు చేశాయని నివేదిక పేర్కొంది. ప్రచార ఖర్చులు, రవాణా, ఇతర వ్యయాలు, అభ్యర్ధులకు సమకూర్చిన నిధులు, సోషల్‌ మీడియా వేదికలపై వెచ్చించిన ఖర్చులను రాజకీయ పార్టీలు తమ వ్యయాల కింద చూపాయి. రాజకీయ పార్టీలు వెల్లడిరచిన మొత్తం ఖర్చులో ప్రచారానికి 34 శాతం చూపగా, ఇతర ఖర్చుల కింద 8.27 శాతం వెచ్చించామని పేర్కొన్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img