ప్రస్తుతం దేశంలో కరోనా ఎక్కువగా వ్యాపిస్తున్నప్పటికీ.. మునుపటిలా కఠినమైన ఆరోగ్యపరిస్థితి ఏర్పడటం లేదు. అందువల్ల కరోనా పరీక్షల విషయంలో ఏమి చేయాలి అనేదానిపై ఐసీఎంఆర్ స్పష్టత ఇచ్చింది.కొవిడ్ పరీక్ష కోసం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కొవిడ్ పరీక్షకు సంబంధించి కొత్త మార్గదర్శాకాలను జారీ చేసింది. దీని ప్రకారం, రిస్క్ కేటగిరీలో ఉంటే తప్ప, కరోనా సోకిన వారితో పరిచయం ఉన్న వ్యక్తులను పరీక్షించాల్సిన అవసరం లేదు. ఐసీఎంఆర్ కొత్త మార్గదర్శకాలు ఏమిటంటే..దగ్గు, జ్వరం, గొంతునొప్పి, శ్వాస తీసుకోవడంలో సమస్యలు లేదా ఇలాంటి సమస్యలు ఉన్నవారు, వాసన ..రుచి సమస్యలు ఉన్నవారు పరీక్షించవచ్చు.మధుమేహం, రక్తపోటు, మూత్రపిండాలు ..ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్న 60 ఏళ్లు ..అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు పరీక్షించవచ్చు.భారతీయ విమానాశ్రయాలు, ఓడరేవులకు వచ్చే విదేశీ ప్రయాణికులను మార్గదర్శకాల ప్రకారం పరీక్షించవచ్చు. అయితే ఇన్ఫెక్షన్ లక్షణాలు లేని వ్యక్తులు, వారికి పరీక్షలు అవసరం లేదు.వయస్సు లేదా వ్యాధుల ఆధారంగా రిస్క్ కేటగిరీలోకి వస్తే తప్ప. వ్యాధి సోకిన వ్యక్తి పరిచయాలను పరీక్షించాల్సిన అవసరం లేదు.అలాగే దేశీయ ప్రయాణాల కోసం అంటే ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి ప్రయాణించే వారికి కూడా పరీక్ష అవసరం లేదు.ఆసుపత్రులలో పరీక్ష మార్గదర్శకాల విషయానికి వస్తే, ఎవరైనా పరీక్షించబడకపోతే, దీని ఆధారంగా శస్త్రచికిత్స లేదా డెలివరీ నిలిపివేయకూడదు. ఒక ఆసుపత్రిలో పరీక్షా సదుపాయం లేకపోతే, రోగిని మరో ఆసుపత్రికి పంపించ కూడదు. వారి నమూనాలను సేకరించి పరీక్ష ల్యాబ్‌కు పంపేందుకు ఏర్పాట్లు చేయాలి.శస్త్రచికిత్స ..విచ్ఛేదనం చేయించుకుంటున్న రోగులు ..డెలివరీ కోసం ఆసుపత్రిలో చేరిన మహిళలు లక్షణాలు కనిపిస్తే తప్ప లేదా అవసరమైతే తప్ప పరీక్షించాల్సిన అవసరం లేదు.