నిన్న ఒక్కరోజే కోటి మందికి పైగా కరోనా టీకా వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ట్విట్టర్‌లో వెల్లడిరచారు.సోమవారం 1,00,96,142 మంది టీకా వేయించుకున్నట్లు ఆయన ట్వీట్ చేశారు.ఒకే రోజు కోటి మందికి పైగా టీకా వేయించుకోవడం ఇది ఐదోసారి అని చెబుతూ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.నిన్నటి వరకు దేశ వ్యాప్తంగా టీకా తీసుకున్న వారి సంఖ్య 86 కోట్లు క్రాస్ అయింది. 100 కోట్ల వ్యాక్సిన్ డోసులు అధిగమిస్తే.. దేశ వ్యాప్తంగా సంబురాలు నిర్వహించేందుకు కేంద్రం ప్లాన్ చేస్తోంది.కొవిడ్ వారియర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్‌తో పాటు హెల్త్‌కేర్ వర్కర్లను ఈ విజయోత్సవాల్లో భాగస్వామ్యం చేయనున్నట్లు తెలుస్తోంది.