Thursday, August 11, 2022
Thursday, August 11, 2022

ఒమిక్రాన్‌లోనే మరో రెండు కొత్త ఉపరకాలు : డబ్ల్యూహెచ్‌ఓ

దేశంలో రోజువారీ కరోనా కేసులు పెరుగుతూ తగ్గుతూ ఉన్నాయి. చైనాలో కేసులు, మరణాలు పెరుగుతుండడంతో కఠినమైన లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. ఇప్పుడు దక్షిణాఫ్రికాలోనూ మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా వేరియంట్‌ ఒమిక్రాన్‌లోనే మరిన్ని ఉత్పరివర్తనాలు జరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ వో) ఆందోళన వ్యక్తంచేసింది. చాలా దేశాల్లో ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ బీఏ2 ప్రభావమే ఎక్కువగా ఉన్నా.. దక్షిణాఫ్రికాలో మాత్రం బీఏ 4, బీఏ 5 అనే కొత్త ఉపరకాలు కరోనా కేసులు పెరిగిపోవడానికి కారణమవుతున్నాయని డబ్ల్యూహెచ్‌ వో చీఫ్‌ టెడ్రోస్‌ అధనోం ఘెబ్రియేసస్‌ అన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో.. ఏమోనని ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్‌ ఎలా మారుతోందో..ఏంటో కూడా తెలియడం లేదన్నారు. చాలా దేశాలు వైరస్‌ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేయడాన్ని ఆపేశాయని, కానీ, దక్షిణాఫ్రికా ఇంకా కొనసాగిస్తోందని చెప్పారు. ఈ క్రమంలోనే రెండు కొత్త ఉప రకాలను గుర్తించగలిగామని అన్నారు. అందరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని, కరోనా నిబంధనలను పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img