Thursday, March 23, 2023
Thursday, March 23, 2023

ఒమిక్రాన్‌ను తేలికపాటి వ్యాధిలా పరిగణించడం చాలా ప్రమదకరం

: డబ్ల్యూహెచ్‌ఓ
కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ శరవేగంగా వ్యాపిస్తూ వణుకు పుట్టిస్తోంది. దీని వ్యాప్తి ఎక్కువగా ఉన్నా డెల్టాతో పోలిస్తే వ్యాధి తీవ్రత తక్కువగా ఉండటం సానుకూల అంశమే అయినా..ఈ వేరియంట్‌ను తేలికపాటి వ్యాధిలా పరిగణించడం ప్రమదకరమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. డబ్ల్యూహెచ్‌ఓ టెక్నికల్‌ లీడ్‌ మరియా వాన్‌ కేర్దోవ్‌ దీనిపై స్పందిస్తూ, ‘ఒమిక్రాన్‌ వ్యాధి తీవ్రత తక్కువే. .ఆసుపత్రి ముప్పు తక్కువగానే ఉంటోంది కానీ..ఇది తేలికపాటి వ్యాధి మాత్రం కాదు. సాధారణ జలుబు లాంటింది కాదు. అలా అని చెప్పడం చాలా ప్రమాదకరం. వృద్ధులు దీని బారినపడితే పరిస్థితి తీవ్రంగా ఉండొచ్చు. ఒమిక్రాన్‌ కేసులు విపరీతంగా పెరగుతున్నాయి. ఆసుపత్రులు నిండిపోవచ్చు. మరణాల రేటు తక్కువగా ఉందని దీన్ని సాధారణంగా పరిగణిస్తూ కథనాలు చెప్పడం అత్యంత ప్రమాదకరం .’ అని చెప్పారు. ఇలాంటి ఆలోచన వైరస్‌ కట్టడిలో నిర్లక్ష్యాన్ని మరింత పెంచుతాయని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img