ఒమిక్రాన్ కరోనా వైరస్ కంటే బీఏ.2 సబ్ వేరియంట్ మరింత అంటువ్యాధి అని అధ్యయనంలో వెల్లడైందని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ప్రపంచంలోని 57 దేశాల్లో ఒమిక్రాన్ బీఏ.2 సబ్ వేరియంట్ కనుగొన్నామని వెల్లడిరచింది. పదివారాల క్రితం దక్షిణాఫ్రికాలో మొదటిసారి కనుగొన్న ఒమిక్రాన్ భారీగా పరివర్తన చెందిందని ప్రపంచఆరోగ్య సంస్థ తన ఎపిడెమియోలాజికల్ అప్‌డేట్‌లో తెలిపింది. కరోనా వైరస్ మానవ కణాలలోకి ప్రవేశించడానికి బీఏ.2 సంబంధించిన సబ్ వేరియంట్ కేసుల్లో స్పష్టమైన పెరుగుదల ఉందని తెలిపింది.