ప్రపంచ దేశాలను వణికిస్తోన్న ఒమిక్రాన్ మనదేశంలోనూ క్రమంగా వ్యాపిస్తోంది.దేశంలో ఇప్పటివరకు 16 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో 236 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త వేరియంట్ కేసులతోపాటు కొవిడ్ కేసులు పెరగుతుండటంతో పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అప్రమత్తమయ్యాయి. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు మళ్లీ కఠిన ఆంక్షల్ని తెర పైకి తెచ్చాయి. ఒమిక్రాన్ భయందోళనల నేపథ్యంలో మధ్యప్రదేశ్లో ఆంక్షలు విధించారు..నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. రాత్రి 11 నుంచి ఉదయం 5 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. అటు మహారాష్ట్ర కూడా ఇదే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో అత్యధిక ఒమిక్రాన్ కేసులో మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం ఉన్నతాధికారులతో అత్యవసరంగా సమావేశమయ్యారు ఇక దిల్లీలో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం విధించారు..గుజరాత్లో 9 నగరాల్లో నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంది..కర్నాటకలోనూ సామూహిక వేడుకలు రద్దుచేశారు.. యూపీలో ఈనెల 31వరకు 144 సెక్షన్ పెట్టారు.. కేరళలోనూ పర్యాటక ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రచురించిన డేటా ప్రకారం, మహారాష్ట్రలో కొత్తగా 65 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రాలలో గరిష్టంగా 64 కేసులతో దిల్లీ రెండో స్థానంలో ఉంది. తెలంగాణలో 24, రాజస్థాన్లో 21, కర్ణాటకలో 19 కేసులు నమోదయ్యాయి.