Wednesday, December 7, 2022
Wednesday, December 7, 2022

ఓబీసీ బిల్లుకు ప్రతిపక్షాల మద్దతు

పెగాసస్‌, పలు అంశాలపై ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తూ పార్లమెంటును స్తంభింపజేస్తున్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్రాలకు హక్కు కల్పించే అంశంపై నేడు ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెడుతున్న రాజ్యాంగ సవరణ బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లు ఏకగ్రీవంగా ప్రకటించాయి. ఈ నేపథ్యంలో మల్లిఖార్జున్‌ ఖర్గే నేతృత్వంలో జరిగిన సమావేశంలో పలువురు నేతలు పాల్గొన్నారు. రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదం దక్కాలంటే మూడవ వంతు మద్దతు అవసరం. ఇది చాలా ముఖ్యమైన అంశమని, అందుకే కేంద్రానికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు విపక్షాలు తెలిపాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img