సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ
విశాలాంధ్ర-గుంతకల్లు: రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులపై సీఎం జగన్ మోహన్‌రెడ్డి పదేపదే భరించలేని రీతిలో భారాలను మోపుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. బుధవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం చీటికి మాటికి విధిస్తున్న విద్యుత్ భారాలను మోయలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఒకేసారి జూన్ నెలలో మూడుసార్లు స్పాట్‌ఆఫ్ చార్జీలు పెంచడం, దీనికి తోడు స్మార్ట్ మీటర్లు బిగిస్తాం…దాని భారం మీ మీద వేస్తాం అని చెప్పడం విడ్డూరమన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ స్మార్ట్ మీటర్లు, స్పాట్ ఆఫ్ చార్జీలు పెంచకుండా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని తెలిపారు. అదాని, అంబానీకి లాభాలు చేకూర్చేందుకు కమీషన్లకు కక్కుర్తిపడి ప్రజలకు అవసరం లేకపోయినా కోట్లాది రూపాయలతో స్మార్ట్ మీటర్లు పెడుతూ, బరితెగించి ప్రజలపై భారాలు మోపుతూ ప్రజలను గగ్గోలు పెట్టిస్తున్నారని విమర్శించారు. విద్యుత్ భారాలపై వామపక్ష పార్టీలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామన్నారు. పోలవరంలో 2020 డిసెంబర్ నాటికి