Wednesday, October 5, 2022
Wednesday, October 5, 2022

కమ్యూనిస్టులను విమర్శించే నైతిక హక్కు బీజేపీ నేతలకు లేదు

: నారాయణ
చెప్పులు మోసే బీజేపీ నాయకులు తమను విమర్శించడం సరికాదని తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులపై సీపీఐ నేత నారాయణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మీ బతుకేందో తమకు ఇప్పుడు అర్థమైందన్నారు. హోం మినిస్టర్‌ పెద్ద క్రిమినల్‌.. ఆయన ఓ కేసులో 12 మంది సాక్షులను, లాయర్లను హత్య చేయించాడు. అట్లాంటి క్రిమినల్‌ వ్యక్తి దురదృష్టవశాత్తు మనకు హోం మినిస్టర్‌ అయ్యాడు. మీరు చెప్పులు మోస్తూ చప్రాసీ పని చేస్తున్నారని రాష్ట్ర బీజేపీ నాయకులను ఉద్దేశించి ధ్వజమెత్తారు.
మీలాంటి వారు కమ్యూనిస్టులను విమర్శించడం సరికాదు. బీజేపీని ఓడిరచేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తామని స్పష్టం చేశారు. కమ్యూనిస్టులను విమర్శించే నైతిక హక్కు బీజేపీ నేతలకు లేదన్నారు. ఈ దేశాన్ని ధ్వంసం చేస్తున్నారు. ఎన్నికైన ప్రభుత్వాలు మీకు వ్యతిరేకంగా ఉంటే ఈడీ దాడులు చేయిస్తున్నారు. బీజేపీ బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు చేస్తుందని ధ్వజమెత్తారు. మీ బానిసబుద్ధికి చెప్పులు మోసుకుంటూ తిరగండి తప్ప.. మీ శక్తికి మించి మాట్లాడకండి అని నారాయణ సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img