Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

కరెంట్‌ కోతల్లేవ్‌ !

విద్యుత్‌ సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొంటాం
సీఎం ఆదేశాలతో అత్యవసర ప్రణాళిక అమలు
రాష్ట్రానికి రోజూ అదనంగా8 బొగ్గు రైళ్లు కేటాయింపు
సోషల్‌ మీడియాలో ప్రచారాన్ని ఖండిరచిన ఇంధన శాఖ

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : విద్యుత్‌ కోతలపై సామాజికమాధ్యమాల్లో వస్తున్న వదంతులను ఇంధనశాఖ తీవ్రంగా ఖండిరచింది. దసరా పండుగ తర్వాత గ్రామాల్లో, మున్సిపాల్టీల్లో, నగరాల్లో లోడ్‌ రిలీఫ్‌ పేరిట గంటలకొద్దీ కరెంటు కోతలు ఉంటాయంటూ సామాజిక మాధ్యమాల్లో కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. బొగ్గు నిల్వలు, సరఫరాల్లో అంతర్జాతీయంగా, దేశీయంగా ఉన్న పరిణామాలు విద్యుత్‌ ఉత్పత్తిపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. అయితే ఇంతటి సంక్షోభ సమయంలోనూ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ ఇచ్చేందుకు రాష్ట్ర విద్యుత్‌పంపిణీ సంస్థలు శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నాయని తెలిపింది. ఎలాంటి సమస్యలు లేకుండా విద్యుత్‌ను అందిస్తున్నాయని, ఎటువంటి కోతల్లేవని స్పష్టం చేసింది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనే వ్యూహంలో భాగంగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అత్యవసర ప్రణాళికల అమలును వెంటనే ప్రారం భించాం. దీనిలోభాగంగా రాష్ట్ర విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ ఏపీ జెన్కోకు అత్యవసరంగా రూ. 250 కోట్లు నిధులు బొగ్గు కొనుగోలు నిమిత్తం సమకూర్చాం. రాష్ట్రానికి అదనంగా రోజుకి దాదాపు 8 బొగ్గు రైళ్లు కేటాయించారు. దేశంలో బొగ్గు లభ్యత ఎక్కడవున్నా కొనుగోలు చేయవలసినదిగా ఏపీ జెన్కోకు ఆదేశాలు ఇచ్చాం. స్వల్ప కాలిక మార్కెట్‌ నుంచి ధర ఎంత పలికినా అవసరాల నిమిత్తం కొనుగోలు చేయాల్సిం దిగా విద్యుత్‌ పంపిణి సంస్థలనూ ఆదేశించాం. కేంద్ర విద్యుత్‌ సంస్థల నుంచి ఎవ్వరికి కేటాయింపని విద్యుత్‌ వాటా నుంచి, వచ్చే సంవత్సరం జూన్‌ వరకు, ఆంధ్రప్రదేశ్‌ కోసం దాదాపు 400 మెగావాట్లు చౌక ధర విద్యుత్‌ కోసం కేంద్ర ప్రభుత్వ విద్యుత్‌ మంత్రిత్వ శాఖను అభ్యర్థించాం. మరో పక్క బకాయిలతో నిమిత్తం లేకుండా కొరతతో వున్న విద్యుత్‌ కేంద్రాలకు బొగ్గు సరఫరా చేయాలన్న కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీకి సరఫరా చేసే అన్ని బొగ్గు ఉత్పత్తి సంస్థలతో సంప్రదింపులు జరిపాం. పొరుగు రాష్ట్రంలో ఉన్న సింగరేణి సంస్థతో సమన్వయం చేసుకుని ఏపీలోని అన్ని ఉత్పత్తి కేంద్రాలకు తగినంత బొగ్గు సరఫరా కోసం నిరంతర ప్రయత్నం జరుగుతోంది. వీటీపీఎస్‌, కృష్ణపట్నంలో కొత్తగా 800 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలను తొందరగా అందుబాటులోకి తేవటానికి తగిన చర్యలు తీసుకుంటున్నాని ఇంధనశాఖ వెల్లడిరచింది. విద్యుత్‌ సరఫరా పరిస్థితిపై ఎటువంటి సమాచారం ఉన్నా తాము అధికారికంగా తెలియజేస్తామని, కరెంట్‌ కోతల్లేవని, సామాజిక మాధ్యమాల్లో వచ్చే దుష్ప్రచారాన్ని నమ్మవద్దని ఏపీఈపీడీసీిఎల్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కె.సంతోషరావు ఒక ప్రకటనలో తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img