Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

కరోనా వేళ..మన పనితీరు దేశ సామర్థానికి నిదర్శనం

కోవిన్‌ ఫ్లాట్‌ఫామ్‌ ద్వారా అతిపెద్ద వ్యాక్సినేషన్‌ ప్రక్రియను చేపట్టి ప్రపంచానికి భారత్‌ ఓ మార్గాన్ని చూపించిందని ప్రధాని మోదీ అన్నారు. నేడు ఉత్తరాఖండ్‌లోని ఎయిమ్స్‌ రుషికేశ్‌లో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ, 35 ప్రెజర్‌ స్వింగ్‌ అబ్జార్పాన్‌ ఆక్సిజన్‌ ప్లాంట్లను ప్రధాని జాతికి అంకితం చేశారు. త్వరలోనే వంద కోట్ల మందికి వ్యాక్సినేషన్‌ మైలురాయిని చేరుకోనున్నట్లు తెలిపారు. కరోనా వేళ..మన పనితీరు దేశ సామర్థానికి నిదర్శనం.. తక్కువ సమయంలోనే అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చామని అన్నారు. మూడు వేల టెస్టింగ్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేశామని, మాస్క్‌లను దిగుమతి చేసేవాళ్లమని, కానీ ఇప్పుడు ఉత్పత్తి చేస్తున్నట్లు ప్రధాని వెల్లడిరచారు. అన్ని రంగాల్లో ఎగుమతి చేసే స్థాయికి మనం చేరుకున్నామని ప్రధాని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌సింగ్‌, దామీతోపాటు కేంద్ర ఆరోగ్యశాఖామంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img