Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

సంతోష్‌ బాబుకు మహావీర్‌ చక్ర పురస్కారం


గాల్వాన్‌ ఘటనలో వీరమరణం పొందిన కల్నల్‌ సంతోష్‌ బాబుకు మహావీర్‌ చక్ర అవార్డు లభించింది.మంగళవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌లో పరమవీర చక్ర అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ సంతోష్‌ బాబు భార్య, తల్లికి మహావీర్‌ చక్ర అవార్డును ప్రదానం చేశారు. గత సంవత్సరం గాల్వాన్‌ లోయలో భారత్‌` చైనా బలగాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో సంతోష్‌ బాబు వీరమరణం పొందారు. సూర్యాపేట జిల్లాకు చెందిన సంతోష్‌బాబు.. 16 బిహార్‌ రెజిమెంట్‌కు కమాండిరగ్‌ అధికారిగా వ్యవహరించారు. చైనా బలగాలు దురాక్రమణకు యత్నించగా.. భారత జవాన్లు దీటుగా తొప్పికొట్టారు. ఈ క్రమంలో చెలరేగిన ఘర్షణల్లో సంతోష్‌బాబు సహా 21 మంది భారత సైనికులు వీర మరణం పొందారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img