Thursday, September 29, 2022
Thursday, September 29, 2022

కాంగ్రెస్‌ అధ్యక్ష రేసులో శశిథరూర్‌ ?

కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టడానికి రాహుల్‌ గాంధీ విముత వ్యక్తం చేస్తుండటంతో ఆ పార్టీకి చెందిన పలువురు నేతల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇప్పటికే రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ పేరు తెరపైకి రాగా.. తాజాగా మరో సీనియర్‌ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ పోటీకి సిద్ధమవుతోన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశాలను థరూర్‌ అన్వేషిస్తున్నారని, అయితే దానిపై తుది నిర్ణయం తీసుకోలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆయన నిర్ణయం తీసుకోలేదని, అయితే త్వరలో ప్రకటన వెలువడచ్చని పేర్కొన్నాయి. కాగా, శశిథరూర్‌ తాజాగా మలయాళం డైలీ ‘మాతృభూమి’లో రాసిన వ్యాసంలో ఆయన మనసులోని మాటను బయటపెట్టారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వ్యాసంలో ఆయన బ్రిటన్‌లో మాదిరిగానే కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలు జరపాలని అభిప్రాయపడ్డారు. బ్రిటన్‌లో బోరిసన్‌ జాన్సన్‌ ప్రధాని పదవి రాజీనామా అనంతరం ప్రధాని పదవి కోసం కన్జర్వేటివ్‌ పార్టీలో జరుగుతున్న ఎన్నికల మాదిరిగానే కాంగ్రెస్‌లోనూ జరగాలని ఆయన పేర్కొన్నారు. అలాగే ఈ పదవికి పోటీ చేసే అభ్యర్థులు తమ విజన్‌ను పార్టీ ముందుంచితే తప్పనిసరిగా అది ప్రజల్లో ఆసక్తి కలిగిస్తుందని చెబుతున్నారు. అలాగే ఈ వ్యాసంలో ఆయన ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీలో నాయకత్వం విషయంలో కొంత శూన్యత నెలకొందని, ఈ ప్రభావం నుంచి బయటపడాలంటే ఎన్నికలు జరపాలని అభిప్రాయపడ్డారు. ఎన్నికల్ని స్వేచ్ఛగా నిర్వహిస్తే.. అది పార్టీ కార్యకర్తలపైనా, ప్రజలపైనా ప్రభావం చూపుతుందని ఆయన పేర్కొన్నారు. ఇక పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారిలో శశిథరూర్‌ కూడా ఉన్నారు. పార్టీకి పునరుత్తేజం రావాలంటే తప్పనిసరిగా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరపాలని సోనియాగాంధీకి లేఖ రాసిన జీ -23 నేతల్లో శశిథరూర్‌ కూడా ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img