Sunday, October 1, 2023
Sunday, October 1, 2023

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ

. 2014కి ఐదేళ్ల సర్వీసున్న వారికి ఛాన్స్‌
. రేపు కేబినెట్‌ భేటీ తర్వాత పీఆర్సీపై ప్రకటన
. దశలవారీ బకాయిలు చెల్లించడానికి ఆమోదం
. మరికొన్ని సమస్యలపైనా సర్కారు సానుకూలం
. మంత్రివర్గ ఉప సంఘంతో సుదీర్ఘంగా సాగిన చర్చలు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఉద్యోగుల సమస్యలపై సోమవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో జరిగిన జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశంలో కొన్ని సమస్యలు కొలిక్కి వచ్చాయి. ముఖ్యంగా కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపింది. అలాగే ఉద్యోగులం దరికీ సంబంధించి పీఆర్సీ సమస్యపై కూడా బుధవారం జరిగే కేబినెట్‌ సమావేశం తర్వాత సానుకూల నిర్ణయాన్ని ప్రకటించ నున్నట్లు చర్చల అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడిరచారు. కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించి 2014 జూన్‌ 2 నాటికి ఐదేళ్లు పూర్తయిన ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తారు. అలాగే సీపీఎస్‌ అంశంపైనా సుదీర్ఘంగా చర్చ జరిగింది. 2003 డీఎస్సీ వారికి పాత పెన్షన్‌ విధానం అమలుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిసింది. బేసిక్‌ పే మీద 33 శాతం హామీగా గ్యారెంటీ పెన్షన్‌ స్కీం (జీపీఎస్‌) అమలు చేసే ఆలోచనలో ఉన్నట్లు కమిటీ వెల్లడిరచింది. యూనివర్సిటీల్లోని నాన్‌ టీచింగ్‌, సొసైటీల్లోని ఉద్యోగులకు 60 నుంచి 62 సంవత్సరాలకు పదవీ విరమణ వయస్సు పెంపునకు మంత్రి వర్గ ఉపసంఘం అంగీకారం తెలిపింది. ఇక పీఆర్సీ బకాయిలకు సంబంధించి నాలుగేళ్లలో 2024లో 10 శాతం, 2025లో 20 శాతం, 2026లో 30 శాతం, 2027లో 40 శాతం చొప్పున చెల్లించే ప్రతిపాదనను కమిటీ తెరపైకి తెచ్చింది. దీనిని ఉద్యోగ సంఘ నేతలు వ్యతిరేకించారు. దీనిపై కూడా బుధవారం జరిగే కేబినెట్‌లో నిర్ణయం తీసుకోనున న్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేశ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కె.ఎస్‌.జవహర్‌ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) చంద్రశేఖర్‌ రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్‌ఆర్‌ఎం) చిరంజీవి చౌదరి, ఆర్థిక శాఖ కార్యదర్శి డా.కె.వి.వి.సత్యనారాయణ, సర్వీసెస్‌, హెచ్‌ఆర్‌ఎం కార్యదర్శి పి.భాస్కర్‌, రాష్ట్ర ఎన్జీఓ సంఘం అధ్యక్షులు బండి శ్రీనివాస్‌, అమరావతి జేఏసీ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కె.వెంకట్రామిరెడ్డి, ఎస్టీయూ అధ్యక్షులు సాయి శ్రీనివాస్‌, పీఆర్టీయూ అధ్యక్షులు కృష్ణయ్య, యూటీఎఫ్‌ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, ఏపీటీఎఫ్‌ అధ్యక్షులు హృదయరాజు, ఏపీ జీఈఏ కార్యదర్శి ఆస్కార్‌ రావు, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు గోపాల కృష్ణ, ఏపీ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు శ్రావణ కుమార్‌, జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లోని ఆయా సంఘాల కార్యదర్శులు, ఇతర సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img