Wednesday, February 1, 2023
Wednesday, February 1, 2023

కాబూల్‌ రక్తసిక్తం – వరుస పేలుళ్లలో 15 మంది మృతి

విమానాశ్రయం వద్ద భారీ జంట పేలుళ్లు
ఆత్మాహుతి దాడిగా అనుమానం
అనేక మందికి గాయాలు..

కాబూల్‌ : అఫ్గానిస్తాన్‌ రాజధాని కాబూల్‌ వరుస పేలుళ్లతో దద్దరిల్లింది. హమీద్‌ కర్జాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల జంట పేలుళ్లు బీభత్సం సృష్టించాయి. అఫ్గానిస్తాన్‌ నుంచి అనేక దేశాలు తమ పౌరులను తరలిస్తున్న సమయంలో గురు వారం సాయంత్రం విమానాశ్రయం అబేగేట్‌, ఒక హోటల్‌ వద్ద వరుసగా భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 15 మంది మృతి చెందారు. మరణించిన వారిలో పిల్లలు కూడా ఉన్నారని, తాలిబన్‌ ప్రతినిధి రాయటర్స్‌ వార్తా సంస్థతో తెలిపారు. అమెరికా, అఫ్గాన్‌ పౌరులు గాయపడ్డారు. ఆత్మాహుతి దాడిగా భావిస్తు న్నట్టు అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది. కాబూల్‌ అంతర్జాతీయ విమానాశ్రయం అబే గేటు వద్ద తొలి పేలుడు చోటుచేసుకోగా, కొద్దిసేపటికే విమానా శ్రయం సమీపంలోని ఒక హోటల్‌ వద్ద రెండవ పేలుడు సంభవించింది. దీంతో ఆ పరిసర ప్రాంతాలలో భీకర వాతావరణం నెలకొంది. రక్తమోడుతూ ప్రాణాలు రక్షించుకునేందుకు క్షతగాత్రులు ఆసుపత్రికి పరుగులు పెడుతున్న దృశ్యాలు కనిపించాయి. కాబూల్‌ విమానాశ్రయం వెలుపల ఆత్మాహుతి దాడులు జరగవచ్చని అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా అనుమానిస్తూనే ఉన్నాయి. తాలిబన్లు ఆత్మాహుతి దాడులకు పాల్పడే అవకాశం ఉందని గురువారం ఉదయమే అమెరికా రక్షణ శాఖ హెచ్చరించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img