కేంద్ర గెజిట్‌లో అభ్యంతరాలను లేవనెత్తిన ఏపీ
అమరావతి : కృష్ణా నదీ యాజమాన్య బోర్డు
గోదావరి నదీ యాజమాన్య బోర్డు సంయుక్త సమన్వయ కమిటీ సమావేశానికి తెలంగాణా అధికారులు గైర్హాజరయ్యారు. హైదరాబాద్ జల సౌధలో మంగళవారం ఉదయం కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఏపీ నుంచి ఇరిగేషన్ ఈఎన్సీలు, ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీలు, బోర్డు మెంబర్లు హాజరయ్యారు. తెలంగాణ అధికారులు మాత్రం ఉద్దేశపూర్వకంగా గైర్హాజరయ్యారు. నదీ జలాల విషయంలో బోర్డులకు పూర్తిస్థాయి అధికారాలు కేటాయిస్తూ కేంద్రం గెజిట్ నోటిషికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గత నెల 29న గోదావరి బోర్డు సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. మంగళవారం ఈ కమిటీ భేటీ నిర్వహించనున్నట్లు 30వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాలకు లేఖ రాసింది. అయితే ఈ అంశంపై సోమవారం స్పందించిన తెలంగాణ ప్రభుత్వం.. ప్రాజెక్టులను గోదావరి బోర్డు పరిధిలోకి తీసుకెళ్తే రాష్ట్రాలకు తీవ్ర దుష్ఫరిణామాలు ఉంటాయని, అందుకే వీటిని పూర్తిస్థాయి బోర్డు భేటీలో చర్చించాల్సి ఉందని పేర్కొంది. బోర్డు భేటీలో అభిప్రాయాలు, మార్గదర్శకాలు తెలుసుకోకుండా నేరుగా సమన్వయ కమిటీ భేటీలో గెజిట్‌పై చర్చించడం సాధ్యం కాదని తెలిపింది. అయితే దీనిపై గోదావరి బోర్డు వెంటనే స్పందించి గత నెల 28న కేంద్ర జల శక్తి శాఖ జాయింట్ సెక్రటరీ సంజయ్ అవస్థీ రాసిన లేఖను ప్రస్తావిస్తూ తెలంగాణకు లేఖ రాసింది. గెజిట్ నోటిఫికేషన్ అమలుకు ఒక నిర్ధిష్ట సమయాన్ని పేర్కొన్నాం. దీనికి అనుగు ణంగా అవసరమైన సమగ్ర కార్యాచరణ ప్రణాళిక, తగిన సమాచారం ఆగస్టు 2లోగా మాకు ఇవ్వాలని కేంద్రం రాసిన లేఖను బోర్డు తన లేఖలో ప్రస్తావిం చింది. ఈ నేపథ్యంలోనే సమన్వయ కమిటీ భేటీని అత్యవసరంగా నిర్వహిస్తు న్నామని వెల్లడిరచింది. అదే విధంగా కృష్ణా బోర్డు సైతం 12 మంది సభ్యులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తూ సోమవారమే లేఖ రాసింది. అయితే ఈ భేటీకి గైర్హాజరు అవుతూ కేఆర్‌ఎంబీ చైర్మన్‌కు తెలంగాణ ప్రభు త్వం లేఖ రాసింది. పూర్తిస్థాయి బోర్డు సమావేశం నిర్వహిస్తే హాజరవుతామని తెలిపింది. భేటీ అనంతరం ఏపీ ఈఎన్‌సీ నారాయణ రెడ్డి మాట్లాడుతూ గెజిట్ ప్రకారం ప్రాజెక్టుల వివరాలు ఇవ్వాలన్న కృష్ణా, గోదావరి బోర్డులు నోటిఫికేషన్‌లో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని చెప్పామని అన్నారు. అభ్యంత రాలున్న ప్రాజెక్టుల వివరాలు ఇవ్వలేమని చెప్పగా, వివరాలిచ్చి ఆ అభ్యంతరా లేంటో కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని బోర్డులు సూచించాయని చెప్పారు. అలాగే టైం షెడ్యూల్ ప్రకారం సమాచారం కావాలని కోరినట్లు తెలిపారు. ఆగస్టు రెండవ వారంలో బోర్డు పూర్తి సమావేశాన్ని నిర్వహిస్తామని జీఆర్‌ఎంబీ ప్రకటించినట్లు ఆయన వెల్లడిరచారు.