Sunday, August 14, 2022
Sunday, August 14, 2022

కృష్ణా ప్రాజెక్టులపై మళ్లీ కిరికిరి

ఏపీ పంప్డ్‌ హైడ్రో స్టోరేజీ పథకాలపై తెలంగాణ అభ్యంతరం
ఆ ప్రాజెక్టులను తక్షణం ఆపాలని కేఆర్‌ఎంబీకి ఈఎన్సీ ఫిర్యాదు

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు సమసిపోయే పరిస్థితి కానరావడం లేదు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన పంప్డ్‌ హౌస్‌ హైడ్రో స్టోరేజీ పథకాలపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. ఈ మేరకు మంగళవారం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) చైర్మన్‌కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్‌ లేఖ రాశారు. ఎలాంటి అనుమతి లేకుండా కృష్ణానదిపై ఏపీ ప్రభుత్వం పంప్డ్‌ స్టోరేజ్‌ పథకాలను చేపట్టిందని అభ్యంతరం వ్యక్తం చేశారు. అనుమతుల్లేని ప్రాజెక్టులను తక్షణమే నిలువరించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ చేపట్టిన అన్ని పంప్డ్‌ స్టోరేజ్‌ పథకాల వివరాలు తెప్పించి ఇవ్వాలని బోర్డును కోరారు. కర్నూలు జిల్లా పిన్నా పురం వద్ద చేపట్టిన గ్రీన్‌ కో విద్యుత్‌ ప్రాజెక్టుపై కూడా ఫిర్యాదు చేశారు. అనుమతి లేకుండా ప్రాజెక్టు కోసం కృష్ణా జలాలను వినియోగించరాదని తెలిపారు. అలాగే కృష్ణా నుంచి ఇతర బేసిన్లకు జలాల తరలింపు, జల విద్యుత్‌ కోసం ఏపీ ప్రభుత్వం వినియోగిస్తున్న కృష్ణా జలాలపైనా తెలంగాణ ఈఎన్సీ అభ్యం తరం తెలిపారు. అపెక్స్‌ కౌన్సిల్‌, బోర్డు అనుమతుల్లేని ప్రాజెక్టు లను కేఆర్‌ఎంబీ వెంటనే నిలిపివేయాలని కోరారు. నాలుగో తరం పారిశ్రామికీకరణకు మూలకేంద్రంగా రాష్ట్రాన్ని మార్చేం దుకు అవసరమైన గ్రీన్‌ ఎనర్జీకి సంబంధించి ఈనెలలో దావోస్‌ లో జరిగిన వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరంలో లక్షా 25వేల కోట్ల పెట్టు బడుల అంచనాతో అదానీ గ్రీన్‌కో, అరబిందోలతో రాష్ట్ర ప్రభు త్వం ఎంవోయూలు చేసుకుంది. పంప్డ్‌ హౌస్‌ స్టోరేజీ లాంటి వినూత్న విధానాలతో సుమారు 27,700 మెగావాట్ల గ్రీన్‌ ఎనర్జీ అందుబాటులోకి రానుంది. ఈ ప్రాజెక్టులకు అవసరమైన నీటి వసతిని కృష్ణా నుంచి అందిస్తామని ఆయా కంపెనీలకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ నేపధ్యంలో దావోస్‌ సదస్సు ముగిసిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం దీనిపై అభ్యంతర తెలియజేయడంతో ఇరు రాష్ట్రాల మధ్య మరోసారి జలవివాదం తెరపైకి వచ్చింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img