Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

కేంద్రంపై కేసు నమోదు చేయాలి


: సంజయ్‌ రౌత్‌
కరోనా సెకండ్‌వేవ్‌లో ఆక్సిజన్‌ కొరత వల్ల మరణాలు సంభవించలేదంటూ ప్రభుత్వం ప్రకటించడాన్ని శివసేన నేత సంజయ్‌ రౌత్‌ తీవ్రంగా ఖండిరచారు. సర్కారు అబద్ధాలు చెబుతోందని, కేంద్రంపై కేసు నమోదు చేయాలన్నారు. ఆక్సిజన్‌ కొరత వల్ల కోవిడ్‌ రోగులు మృతి చెందలేదని రాష్ట్రాలు పేర్కొన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్‌ సుఖ్‌ మాండవీయ నిన్న రాజ్యసభలో వెల్లడిరచారు. దీనిపై బుధవారంనాడిక్కడ మీడియాతో సంజయ్‌రౌత్‌ మాట్లాడుతూ, ‘’నాకు మాట రావడం లేదు. ఆక్సిజన్‌ దొరక్క తమ కళ్లముందే కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి పరిస్థితి కేంద్రం చేసిన ప్రకటనతో ఎలా ఉంటుంది? ప్రభుత్వంపై కేసు పెట్టాలి. వాళ్లు అబద్ధాలు ఆడుతున్నారు’’ అని సంజయ్‌ రౌత్‌ అన్నారు. ఏప్రిల్‌ 23 న జైపూర్‌ గోల్డెన్‌ ఆసుపత్రిలో 20మంది రోగులు, మే 1 న ఢల్లీిలోని బాత్రా హాస్పిటల్‌ లో 12 మంది, కర్ణాటక లోని చామరాజనగర్‌ ఆసుపత్రిలో మే 2 న 24 మంది మృతి చెందారు.ఆ నెలల్లో ఇంత ‘బీభత్సం’ జరిగినా ప్రాణవాయువు కొరత వల్ల కోవిడ్‌ రోగులు మృతి చెందలేదని మంత్రిగారు చెప్పడం హాస్యాస్పదమని సంజయ్‌ రౌత్‌ పేర్కొన్నారు. కాగా పెగాసస్‌ వివాదంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ చేత గానీ, సుప్రీంకోర్టు చేతగానీ విచారణ జరిపించాలని ఆయన డిమాండు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img