London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Thursday, October 10, 2024
Thursday, October 10, 2024

కేంద్రమే నడపలేకపోతే… రాష్ట్రానికి సాధ్యమా?

. ప్రైవేటీకరణను బీఆర్‌ఎస్‌ వ్యతిరేకిస్తుందా? సమర్థిస్తుందా?
. వ్యతిరేకిస్తే, కేంద్రానికి లేఖ రాయొచ్చు కదా?
. మంత్రి అమర్‌నాథ్‌ వింత వాదన

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు మేం వ్యతిరేకమంటూనే పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మంగళవారం మీడియా సమావేశంలో విచిత్ర వాదన వినిపించారు. కేంద్రం నడపలేని ఒక సంస్థను రాష్ట్ర ప్రభుత్వం నడపగలుగుతుందా? అని ప్రశ్నించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వం నడపలేకపోయినప్పుడు, రాష్ట్ర ప్రభుత్వానికి ఎలా సాధ్యమవుతుంది? అందుకే తెలంగాణకు కూడా అది సాధ్యం కాదని తేల్చిచెప్పారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌… రాజకీయాల్లో భాగంగా వారు చేసేది చేస్తున్నారు. ఇప్పుడు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను అమ్మేస్తామని కేంద్రం చెబుతోంది. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ఇంకా బిడ్‌లో పాల్గొనలేదు. ఒక బృందాన్ని పంపించి, ప్లాంట్‌ నిర్వహణ సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తామని మాత్రమే చెప్పారు. అయితే ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకమా? కాదా? ఒకవేళ ప్రైవేటీకరణకు అనుకూలం అనుకుంటే, ఇలా ప్రైవేటీకరణ చేస్తున్న ప్రతి చోటా తామూ బిడ్‌లో పాల్గొంటామని చెబుతారా? ఒకవేళ అలాంటి ఉద్దేశం, ఆలోచన లేనప్పుడు, ఏ విధంగా ఇప్పుడు బిడ్‌లో పాల్గొంటారనేది వారే చెప్పాలి. ప్రైవేటీకరణ వద్దని మొన్న వారే చెప్పారు. మరి ఈ రోజు బిడ్‌లో పాల్గొంటున్నారంటే… ప్రైవేటీకరణకు వారు అనుకూలంగా ఉన్నట్లే కదా? అందువల్ల ప్రైవేటీకరణకు అనుకూలమా? వ్యతిరేకమా? అన్నదానికి ముందుగా వారు సమాధానం చెప్పాలి. ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తే, కేంద్రానికి లేఖ రాయొచ్చు కదా? సంస్థకు క్యాపిటివ్‌ మైన్స్‌ ఇవ్వమని కోరవచ్చు కదా? అంటూ తెలంగాణ ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుకోవడానికి ఉన్న అంశాలను సీఎం జగన్‌, ప్రధాని మోదీకి మూడు, నాలుగు సందర్భాలలో చెప్పారు. క్యాపిటివ్‌ మైన్స్‌ ఇవ్వాలని, రుణాలు సేకరించి పునరుద్ధరణ చేయొచ్చని చెప్పాం. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రజల సెంటిమెంట్‌తో కూడుకున్నదని, ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ చేయవద్దని గట్టిగా చెప్పాం. అసెంబ్లీలో తీర్మానం కూడా చేశాం. అలాగే విశాఖలో 4 లక్షల మందితో బహిరంగ సభ ఏర్పాటు చేసి స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించాం. ఇది మా విధానం అయితే… అమ్మటం-కొనటం… ఆ పార్టీల విధానాలంటూ బీఆర్‌ఎస్‌ను విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ గత ఏడాది ఏప్రిల్‌ 19, 2022న మెమో ద్వారా నియమావళి ప్రకటించింది. 51 శాతం, అంతకంటే ఎక్కువ వాటా కలిగి ఉన్న కేంద్ర ప్రభుత్వరంగ సంస్థగానీ, రాష్ట్ర ప్రభుత్వ సంస్థగానీ లేదా సంయుక్త భాగస్వామ్య సంస్థగానీ, మరే ఇతర ప్రభుత్వరంగ సంస్థల (పీఎస్‌యూ) ప్రైవేటీకరణ బిడ్లలో పాల్గొనరాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. నిబంధనలు ఇలా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు అంత శక్తే ఉండదని తెలిసినప్పుడు… తెలంగాణ ప్రభుత్వం వచ్చేస్తుందని చెప్పటం ఏమిటి? కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా అనుమతి ఇస్తే తప్ప, అలా పాల్గొనే వీలు లేదని మంత్రి స్పష్టం చేశారు. స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుకోవడానికి ఉన్న అవకాశాలన్నింటినీ కేంద్రానికి నివేదించాం. సంస్థను కాపాడుకోవడానికి ఉన్న అన్ని మార్గాలు ఉపయోగించుకుంటాం. ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఉన్నా, ఒకవేళ కేంద్రం విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను అమ్మేస్తే, వారు తీవ్ర ప్రజాగ్రహానికి గురికాక తప్పదు. ఎందుకంటే అది ప్రజల సెంటిమెంట్‌తో కూడుకున్నది. ప్రజల సెంటిమెంట్‌ను గౌరవించాల్సిన బాధ్యత కేంద్రంపైన ఉందని మంత్రి అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img