Thursday, September 29, 2022
Thursday, September 29, 2022

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న నిరసనలతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో పాటు ప్రయాణికులు, రోగులు, దివ్యాంగులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై జాతీయ మానవహక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ)కు పలు ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో రైతులు చేస్తున్న నిరసనలపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ కేంద్రంతోపాటు రాజస్థాన్‌,దిల్లీ, హర్యానా రాష్ట్ర ప్రభుత్వాలకు మంగళవారం నోటీసులు జారీ చేసింది. యూపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హర్యానా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాజస్థాన్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, దిల్లీ ప్రభుత్వ ఎన్‌సిటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోలీసు డైరెక్టర్లు, యూపీ, హర్యానా, రాజస్థాన్‌ కమిషనర్‌కు జాతీయ మానవ హక్కుల కమిషన్‌ నోటీసులు జారీ చేసింది.దీనిపై వెంటనే నివేదికలు సమర్పించాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీ జారీ చేసిన నోటీసుల్లో ఆదేశించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img