Wednesday, February 8, 2023
Wednesday, February 8, 2023

కొలీజియంలో ప్రభుత్వానికి ప్రాతినిధ్యం

కేంద్ర మంత్రి రిజిజు

న్యూదిల్లీ: సర్వోన్నత న్యాయస్థానంతో పాటు ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామ కాలలో ప్రభుత్వానికి సముచిత పాత్ర ఉండా లని కేంద్ర న్యాయమంత్రి కిరణ్‌ రిజిజు నొక్కి చెప్పారు. జాతీయ న్యాయ నియామకాల కమిషన్‌ చట్టాన్ని (ఎన్‌జేఏసీ) కొట్టివేసినప్పుడు కొలీజియం వ్యవస్థ ఎంఓపీలను మరలా రూపొందాలని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మా సనం చేసిన సూచనల మేరకు కొలీజియం వ్యవస్థలో ప్రభుత్వానికి ప్రాతినిధ్యం కోరుతున్నట్లు వెల్లడిరచారు. ఇదే విషయంలో ఆయన తాజాగా సీజేఐ డీవై చంద్రచూడ్‌కు లేఖ పంపారు. రాజ్యాంగానికి ఏదీ అతీతం కాదని, దానికి కట్టుబడాలని, రాజ్యాంగానికి విరుద్ధంగా కొలీజియం పనితీరు ఉన్నదని విమర్శించారు. కేంద్ర`రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులను సుప్రీంకోర్టు, హైకోర్టుల కొలీజియాల్లో చేర్చడం వల్ల న్యాయమూర్తుల ఎంపికలో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుందని సీజేఐకు రాసిన లేఖలో రిజిజు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చేసిన సూచనలు, గమనించిన విషయాల ఆధారంగానే లేఖలో కొన్ని అంశాలను ప్రస్తావించినట్లు తెలిపారు. న్యాయవ్యవస్థ పేరిట సౌకర్యమైన రాజకీయాలు తగవన్నారు. రాజ్యాంగానికి ఏదీ అతీతం కాదని రిజిజు ట్వీట్‌ చేశారు. అదే సమయంలో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ చేసిన వ్యాఖ్యలను ట్విట్టర్‌ మాధ్యమంగా ఆయన తిప్పికొట్టరు. తమ నామినీలను కొలీజియంలో చేర్చాలని సుప్రీంకోర్టును కేంద్రప్రభుత్వం కోరడం చాలా ప్రమారకమని కేజ్రీవాల్‌ చేసిన వ్యాఖ్యలకు స్పందనగా ‘మీరు కోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తారని భావిస్తున్నా! నాడు ఎన్‌జేఏసీ చట్టాన్ని కొట్టివేసినప్పుడు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చేసిన సూచనల ప్రకారమే ఈ కార్యాచరణ కోరుతున్నాం. కొలీజియం వ్యవస్థ ఎంఓపీలను తిరిగి రూపొందించాలని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సూచించింది’ అని రిజిజు ట్వీట్‌చేశారు. ‘న్యాయవ్యవస్థలో జరిగే నియామకాల్లో ప్రభుత్వ జోక్యం ఏ మాత్రం ఉండరాదు. ఇది చాలా ప్రమాదకరం’ అని కేజ్రీవాల్‌ అంతకుముందు ట్వీట్‌ చేశారు. రిజిజుతో పాటు ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్కర్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా కూడా న్యాయవ్యవస్థను విమర్శించారు. శాసనాధికారులను అతిక్రమించే యత్నం జరుగుతోందని ధన్కర్‌, బిర్లా వ్యాఖ్యానించారు. జడ్జీల నియామకం, పదోన్నతలు, బదిలీల విషయమై ఏడేళ్లుగా కేంద్రానికి, కొలీజియానికి మధ్య రాజీ కుదరకపోవడం ఆశ్చర్యకరమని పార్లమెంటరీ ప్యానల్‌ కూడా ఇటీవల వ్యాఖ్యానించడం విదితమే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img