లూథియానా, బెంగళూరులో కరోనా కలకలం
పంజాబ్‌లోని లూథియానాలో కొవిడ్ కలకలం రేపింది. స్కూళ్ళు తెరిచిన వారం రోజులకే 20 మంది చిన్నారులకు కరోనా పాజిటివ్ నిర్థారణయ్యింది. రెండు స్కూళ్లలోని విద్యార్థులు ఈ వైరస్ కి గురయ్యారని డిప్యూటీ కమిషనర్ తెలిపారు. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో ఈ నెల 2 నుంచి పాఠశాలలను తెరిచారు. కాగా కర్ణాటక రాజధాని నగరం బెంగళూరులో గత ఐదు రోజుల వ్యవధిలో 242 మంది చిన్నారులకు కొవిడ్ పాజిటివ్ సోకింది. వీరిలో తొమ్మిదేళ్లలోపు చిన్నారులు 106 మంది ఉండగా, 9 నుంచి 19 ఏళ్లలోపు వారు 136 మంది ఉన్నారు. బీబీఎంపీ ఈ మేరకు వివరాలు వెల్లడిరచింది. కొవిడ్ థర్డ్‌వేవ్ వస్తే చిన్నారులపై అధిక ప్రభావం ఉంటుందని భావిస్తున్న తరుణంలో చిన్నారులు కొవిడ్ బారినపడటం ఆందోళన కలిగిస్తోంది.