ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొవిన్ పోర్టల్ లో సిరమ్ ఇన్ స్టిట్యూట్ కు చెందిన కొవోవాక్స్ బూస్టర్ డోసును అందుబాటులో ఉంచేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుక్ మాండవీయ ఆమోదించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. Covid Vaccine: కొవిన్ పోర్టల్ లో అందుబాటులోకి రానున్న మరో బూస్టర్ డోసు.. ధర ఎంతంటేCovid Vaccine
ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొవిన్ పోర్టల్ లో సిరమ్ ఇన్ స్టిట్యూట్ కు చెందిన కొవోవాక్స్ అనే బూస్టర్ డోసును అందుబాటులో ఉంచేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుక్ మాండవీయ ఆమోదించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అయితే కొన్నిరోజుల్లోనే ఈ బూస్టర్ డోసు ఆ పోర్టల్ లో లభించనుందని పేర్కొన్నారు. ఒక కొవోవాక్స్ బూస్టర్ డోస్ ధర సుమారు రూ.225 ఉంటుందని వెల్లడించారు. సిరమ్ ఇన్ స్టిట్యూట్ కు చెందిన డైరెక్టర్ ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖకు లేఖ రాశారు. కొవోవాక్స్ ను DCGI, WHO, అలాగే USFDA లు ఆమోదించాయని.. దీనిని వయోజనులకు బూస్టర్ డోసుగా కొవిన్ పోర్టల్ అందుబాటులో ఉంచాలని కోరాడు.