Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

కోవిడ్‌ మరణాల్లో భారత్‌ టాప్‌

141 దేశాల్లోనే అత్యధికం
ఎనిమిది రాష్ట్రాల్లో ప్రతి లక్ష మందిలో 200 మరణాలు
లాన్సెట్‌ తాజా అధ్యయనంలో వెల్లడి

న్యూదిల్లీ : కోవిడ్‌ మహమ్మారి దశలవారీగా విజృంభిస్తూ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసింది. మొత్తం 141 దేశాలను వణికించింది. లక్షల్లో ప్రాణాలను హరించింది. కోవిడ్‌తో అత్యధిక మరణాలు భారత్‌లో సంభవించినట్లు లాన్సెట్‌ తాజా అధ్యయనం చెబుతోంది. 202021లో కోవిడ్‌ బారిన పడి దేశంలో 4.07 మిలియన్ల మంది మరణించారని వెల్లడిరచింది. ఈ సంఖ్య అధికారిక మరణాల కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ కాగా, అధికారిక లెక్క 0.5 మిలియన్‌ అని తెలిపింది. కోవిడ్‌19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా సంభవించిన మరణాల అంచనా కోసం చేసిన తొలి ప్రయత్నంలో భాగంగా ఈ మేరకు నివేదికను లాన్సెట్‌ వెలువరించింది. 2020 మార్చి నాటి నుంచి 191 దేశాల్లో 18.2 మిలియన్ల మంది కోవిడ్‌తో చనిపోగా అధికారిక లెక్క 5.94 మిలియన్‌లుగా ఉన్నట్లు అధ్యయనం తెలిపింది. ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ మెట్రిక్స్‌ అండ్‌ ఈవాల్యుయేషన్‌ (ఐహెచ్‌ఎంఈ) నిపుణుల బృందం ఈ అధ్యయనాన్ని చేపట్టింది. ఇది అమెరికాలోని స్వతంత్ర పరిశోధన సంస్థ. మహమ్మారి మొదలైనప్పటి నుంచి వేర్వేరు ఎపిడెమియోలాజికల్‌ ఫోర్‌కాస్టులను విశ్లేషిస్తోంది. భారత్‌ తర్వాత అధిక మరణాలు అమెరికాలో సంభవించాయని, 24 నెలల్లో 11.3 లక్షల మంది చనిపోయారని, ఇది అధికారిక లెక్క కంటే 1.14 రెట్లు ఎక్కువ అని అధ్యయనం వెల్లడిరచింది. రష్యా, మెక్సికో, బ్రెజిల్‌, ఇండోనేషియా, పాకిస్థాన్‌ దేశాల్లో 5 లక్షల కంటే ఎక్కువగా మరణాలు సంభవించినట్లు తెలిపింది. మొత్తం 191 దేశాల్లో సంభవించిన మరణాల్లో సగానికిపైగా ఈ ఏడు దేశాల్లోనే సంభవించినట్లు లాన్సెట్‌ అధ్యయనం పేర్కొంది. ఈ మరణాలన్నీ కోవిడ్‌ కాలంలో సంభవించాయిగానీ అన్నింటికి కరోనానే కారణమని చెప్పలేదు. కరోనా వేళ వరుస లాక్‌డౌన్‌లు, ఆర్థిక మందగమనం నేపథ్య పరిస్థితులు కూడా పలు మరణాలకు దారితీసినట్లు నివేదిక చెబుతోంది. దేశాలు ప్రతి సంవత్సరం అందించే మరణాల డేటా ఆధారంగానే తమ నివేదికను రూపొందించినట్లు పరిశోధన బృందం తెలిపింది. కొన్ని దేశాలు మరణాలు, వాటి కారణాలనూ తెలుపుతాయి. రెండేళ్లుగా ఈ పద్ధతి 36 దేశాలకే పరిమితమైంది. ఇటువంటి పద్ధతిని భారత్‌లో అనుసరించడం అసాధ్యమని గణితశాస్త్రవేత్త, వ్యాధి మోడలార్‌ మురాద్‌ బనాజీ అభిప్రాయపడ్డారు. ఎన్ని మరణాలు కోవిడ్‌ వల్ల సంభవించాయి, ఎన్ని కాదు అని తేల్చడం భారత్‌లో ఓ పీడకలేనని తెలిపారు. ఈయన ప్రస్తుత అధ్యయనంలో భాగం కాదుగానీ గతేడాది సొంత అంచనాలను ప్రచురించారు. 2020, 2021లో మూడు మిలియన్ల అదనపు మరణాలు భారత్‌లో ఉండవచ్చునని తెలిపారు. భారత్‌కు సంబంధించి సివిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టమ్‌ (పౌర నమోదు వ్యవస్థ) (సీఆర్‌ఎస్‌) ద్వారా అదనపు మరణాలను ఐహెచ్‌ఎంఈ అంచనా వేసింది. ఆ సంవత్సరం అదనంగా ఎన్ని మరణాలు సంభవించాయో లెక్క తేల్చాలంటే పరిశోధకులకు రెండు సెట్ల డేటా అవసరం. అందులో మొదటిది బేస్‌లైన్‌ అంచనాÑ రెండవది బేస్‌లైన్‌కు మించి ఎన్ని సంభవించాయో తెలియాలి. 2018, 2019 సంవత్సరాలకు సంబంధించి సీఆర్‌ఎస్‌ ద్వారా బేస్‌లైన్‌ గణాంకాలు అందగా వాటి ఆధారంగా 2020, 2021లో అదనంగా సంభవించిన మరణాలను అధ్యయనకారులు అంచనా వేశారు. ఆయా సంవత్సరాల్లో సంభవించిన మరణాల సంఖ్యతో తమ అంచనాను పోల్చిచూడగా 4.07 మిలియన్ల మేర తేడా రావడంతో విస్తుపోయారు. సీఆర్‌ఎస్‌ డేటా కేవలం 12 రాష్ట్రాల వద్దనే అందుబాటులో ఉండగా మిగతా 16 కోసం బృందమే అంచనాలు వేయాల్సి వచ్చింది అని నివేదిక చెబుతోంది. దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో ప్రతి లక్ష మందికి 200 చొప్పున మరణాలు ఉన్నాయి.191కుగాను 50 దేశాల్లోనే మహమ్మారి వేళ మరణాలు అధికంగా సంభవించాయి. దారుణ పరిస్థితులను ఎదుర్కొన్న భారత్‌లోని ఎనిమిది రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్‌, మణిపూర్‌, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌, హరియాణా, హిమాచల్‌ ప్రదేశ్‌, పంజాబ్‌, కర్ణాటక ఉన్నాయి. అరుణాచల్‌ ప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, సిక్కిం, రాజస్థాన్‌, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, జార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌, గోవా రాష్ట్రాల్లో అంతర్జాతీయ సగటు (లక్షకు 120.6 మరణాలు) కంటే తక్కువగానే మరణాల రేటు ఉంది. మరణాల కచ్చితత్వంలో మహారాష్ట్ర 0.6 మిలియన్లతో అగ్రస్థానంలో ఉంటే 0.3 మిలియన్లతో బీహార్‌ రెండవ స్థానంలో ఉంది. కోవిడ్‌ మరణాలను తక్కువగా చూపుతున్నారన్న క్రమంలో కచ్చిత సంఖ్య కోసం అనేక అధ్యయనాలు జరిగాయి. 2022, జనవరి 6న టొరంటో యూనివర్సిటీ ఎపిడెమిలాజిస్ట్‌ ప్రభాత్‌రaా నేతృత్వంలో జరిగిన విశ్లేషణ ప్రకారం 2020లో భారత్‌లో 3.2 మిలియన్‌ ‘అదనపు’ మరణాలు సంభవించగా, 2021లో ఈ సంఖ్య 2.7 మిలియన్లుగా ఉందని వెల్లడి అయింది. ఇలాంటి అధ్యయనాలు ఎప్పుడు జరిగినా అవి నివేదించే వివరాలను కేంద్రప్రభుత్వం తోసిపుచ్చుతూ ఉంది. 2021, జూన్‌ 12నÑ 2021, జులై 22నÑ 2021, జులై 27న, 2022 జనవరి 14న నాలుగు ప్రకటనలు చేసింది. అన్ని సందర్భాల్లోనూ తక్కువ మరణాలు చూపుతున్నారనడాన్ని కొట్టిపారేసింది. ఇలా నివేదికలను తోసిపుచ్చడం, అందులోని వివరాలను కొట్టిపారేయడం మానేసి అంత మంది మరణానికి కోవిడ్‌ కాకపోతే కారణం ఏమిటో చెప్పడం సబబుగా ఉంటుందని బానాజీ అభిప్రాయపడ్డారు. ఏదిఏమైనా మహమ్మారి కట్టడిలో వైఫల్యం ఉందని, నాలుగు మిలియన్ల మంది చనిపోవడం మామూలు విషయం కాదని నిపుణులు అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img