Thursday, December 8, 2022
Thursday, December 8, 2022

గంజాయి కేసుల్లో వైసీపీ సర్కార్‌ ఏపీని మొదటి స్థానంలో నిలిపింది.. పవన్‌ కళ్యాణ్‌

గంజాయి కేసుల్లో ఏపీని మొదటి స్థానంలో నిలిపారని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. ట్విట్టర్‌ లో ప్రభుత్వంపై పవన్‌ ప్రశ్నల వర్షం కురిపించారు. రోడ్లు వేయడం లేదని, చెత్త మీద పన్నులు వేస్తున్నారన్నారు. పీఆర్సీపై మాట మార్చారని, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదన్నారు. పోలీసులకు టీఏ, డీఏలు ఇవ్వడం లేదన్నారు. రాజధానిపై అసెంబ్లీలో చెప్పిన దానికి భిన్నంగా చేస్తున్నారన్నారు. ఉత్తరాంధ్రలో వలసలు ఆపలేకపోయారన్నారు. రుషికొండను ధ్వంసం చేసి భవనం నిర్మించుకుంటున్నారన్నారు. ఇవన్నీ చేస్తున్నందుకు గర్జనలా అని ప్రశ్నించారు. సంపూర్ణ మద్య నిషేధం అద్భుతంగా అమలు చేస్తున్నందుకా ..? మద్య నిషేధం ద్వారా ఏటా రూ.22వేల కోట్లు సంపాదిస్తున్నందుకా..? ఇసుకను అడ్డగోలుగా దోచుకుంటున్నందుకా..? రాష్ట్రాన్ని అప్పుల బాట పట్టించినందుకా..? అని పవన్‌ ప్రశ్నించారు..

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img