Monday, January 30, 2023
Monday, January 30, 2023

గుజరాత్‌లో 120 కిలోల హెరాయిన్‌ స్వాధీనం

గుజరాత్‌లో భారీగా మత్తుపదార్థాలు పట్టుబడ్డాయి. ద్వారకా జిల్లాలోని మెర్బిలోని జిన్‌గూడ గ్రామంలో 120 కిలోల హెరాయిన్‌ను గుజరాత్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్వ్కాడ్‌ (ఏటీఎస్‌) స్వాధీనం చేసుకున్నది. ఈ విషయాన్ని గుజరాత్‌ హోంశాఖమంత్రి హరీష్‌ సంఫ్వీు వెల్లడిరచారు. ‘గుజరాత్‌ రాష్ట్రం నుంచి మాదకద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా నిరోధించే క్రమంలో రాష్ట్ర పోలీసులు మరో అడుగు ముందుకేశారు. తాజాగా గుజరాత్‌ ఏటీఎస్‌ నేతృత్వంలో 120 కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకొన్నాం.’ అని పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న వాటి విలువ సుమారు రూ.600 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. మత్తు పదార్థాల ముఠాకు చెందిన నలుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. గత సెప్టెంబర్‌లో కచ్‌లోని ముంద్రా పోర్టులో మూడు వేల కిలోల మత్తు పదార్థాలను డీఆర్‌ఐ అధికారులు సీజ్‌ చేశారు. దీని విలువ రూ.21 వేల కోట్లు ఉంటుందని వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img