Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

గురువారం నాటి ఘటనలు బాధించాయి


వెంకయ్య తీవ్ర మనోవేదన
రాజ్యసభలో గురువారం జరిగిన ఘటనలపై చైర్మన్‌ వెంకయ్య నాయుడు విచారం వ్యక్తం చేశారు. గురువారం ఐటీ శాఖ మంత్రి వైష్ణవ్‌ చేతుల్లోంచి పేపర్లను లాగి, చించివేసిన ఘటనను ఆయన గుర్తు చేశారు. కేంద్ర ఐటీశాఖ మంత్రి ప్రకటన చేస్తున్నప్పుడు ఆయన నుంచి పత్రాలను లాక్కొని ముక్కలు ముక్కలుగా చేయడం ద్వారా సభా కార్యకలాపాలను కొత్త స్థాయికి చేర్చారని వ్యాఖ్యానించారు. తనను చాలా బాధించిందన్నారు. అలాంటి ఘటన మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై దాడి లాంటి చర్యలే అని వెంకయ్య అన్నారు. మంత్రి చేతుల్లోంచి పేపర్లు లాగిన టీఎంసీ ఎంపీ శాంతను సేన్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. కంద్ర సహాయ మంత్రి వీ మురళీధరన్‌.. సేన్‌ సస్పెషన్‌పై తీర్మానం ప్రవేశపెట్టారు. వర్షాకాల సమావేశాలు పూర్తి అయ్యే వరకు సేన్‌ను సస్పెండ్‌ చేశారు. మూజువాణి ఓటు ద్వారా సస్పెన్షన్‌ను తీర్మానించారు. సభ వాయిదాపడి మళ్లీ ప్రారంభమైన తర్వాత ఎంపీ శాంతను సేన్‌ హౌజ్‌లోనే ఉండిపోవడంతో సభ నుంచి వెళ్లిపోవాలంటూ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ .. ఎంపీ శాంతను సేన్‌ను కోరారు. ఆ తర్వాత సభను అరగంట వాయిదా వేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img