Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

గ్యాలంటరీ పోలీసు పతకాలు

ఆంధ్రప్రదేశ్‌కు 11, తెలంగాణకు 14
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సైనిక, పోలీసు అధికారులకు వివిధ పతకాలను కేంద్ర హోంశాఖ ప్రకటించింది. వివిధ రాష్ట్రాలకు చెందిన 1380 మంది పోలీసులకు పతకాలను ప్రకటిస్తూ.. ఆ జాబితాను కేంద్రం విడుదల చేసింది. ఇద్దరికి అత్యున్నతమైన రాష్ట్రపతి పోలీసు పతకాలు ప్రకటించగా, 628 మంది గ్యాలంటరీ పోలీసు పతకాలు ప్రకటించారు. 88 మందికి రాష్ట్రపతి పోలీసు పతకాలు, 662 మందికి విశిష్ట సేవా పతకాలను అందించనున్నారు. వీటిలో తెలంగాణకు చెందిన 14 మందికి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 11 మందికి గ్యాలంటరీ పోలీసు పతకాలు దక్కాయి. తెలంగాణకు చెందిన అడిషనల్‌ డీజీపీ, వుమెన్‌ సెఫ్టీ వింగ్‌ ఇంచార్జి స్వాతి లక్రా, జనగామ వెస్ట్‌ జోన్‌ డిప్యూటీ పోలీసు కమిషనర్‌ బండ శ్రీనివాస్‌ రెడ్డికి రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీసు పతకాలు దక్కాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img