Saturday, August 13, 2022
Saturday, August 13, 2022

‘ఘోస్ట్‌ ఆఫ్‌ కీవ్‌’ అంటే ఒక వ్యక్తి కాదు..అదో బ్రిగేడ్‌..!

వెల్లడిరచిన ఉక్రెయిన్‌ ఎయిర్‌ఫోర్స్‌
ఉక్రెయిన్‌పై రష్యా దాడి మొదలుపెట్టినప్పటి నుంచి ‘ఘోస్ట్‌ ఆఫ్‌ కీవ్‌’ అనే రహస్య పైలెట్‌ పేరు సామాజిక మాధ్యమాల్లో మారుమోగుతున్న సంగతి తెలిసిందే. తమ దేశంపై రష్యా దండయాత్ర ప్రారంభమైన తొలి రోజు నుంచి స్టెఫాన్‌ శత్రు దేశానికి చెందిన యుద్ధ విమానాలపై విరుచుకుపడ్డాడని… 40 ఫైటర్‌ జెట్లను కూల్చేశాడని వార్తలు వచ్చాయి. అంతేకాదు… అంతేకాదు ఇటీవల స్తెపాన్‌ తారాబల్కా (29) రష్యా దాడిలో మరణించాడని, ‘ఘోస్ట్‌ ఆఫ్‌ కీవ్‌’ అమరుడయ్యాడనే వార్తలు మీడియాను హోరెత్తించాయి. ‘ప్రతిష్టాత్మక ‘ద మర్డర్‌ ఆఫ్‌ ద గోల్డెన్‌ స్టార్‌ పురస్కారంతోనూ ఉక్రెయిన్‌ అతడిని గౌరవించింది. అయితే ‘ఘోస్ట్‌ ఆఫ్‌ కీవ్‌’ గురించి ఉక్రెయిన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ క్లారిటీ ఇచ్చింది. ఘోస్ట్‌ ఆఫ్‌ కీవ్‌ అంటే ఒక వ్యక్తి కాదని… అత్యంత సుశిక్షితులైన పైలట్ల బృందం ‘టాక్టికల్‌ ఏవియేషన్‌ బ్రిగేడ్‌’కు పెట్టిన పేరు అదని వెల్లడిరచింది. మరోవైపు స్టెఫాన్‌ తారాబల్కా 40 యుద్ధ విమానాలను కూల్చలేదని ఉక్రెయిన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ తెలిపింది. ఉక్రెయిన్‌ సైన్యం సాధించిన విజయాలను ఏ ఒక్కరికో ఆపాదించకుండా… అందరి సమష్టి విజయంగా చూడాలని చెప్పింది. సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి ముందు దాని గురించి పక్కాగా తెలుసుకోవాలని సూచించింది. స్టెఫాన్‌ తారాబల్కా మార్చి 13న మరణించారని స్పష్టతనిచ్చింది. స్టెఫాన్‌ యుద్ధ వీరుడని… ఆయన ఘోస్ట్‌ కాదని తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img