Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 10, 2024
Tuesday, September 10, 2024

చిత్తూరు జిల్లాలో వ్యవసాయ కార్మిక సంఘం అధ్వర్యాన భూపోరాటం

భూముల్లో అరుణపతాక రెపరెపలు
పేదలకు భూములు దక్కెేంత వరకు పోరాటం : ఆవుల శేఖర్‌

కేవీబీపురం : చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గం లోని దళితులు, గిరిజనులు ఐదు కాలనీల పేదలు మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయకార్మిక సంఘం జిల్లా సమితి అధ్వర్యాన భూపోరాటం నిర్వహించారు. కేవీబీపురం మండలంలోని కండ్లురు ఎస్సీ ఎస్టీ కాలనీ, ఆధరం, తిమ్మినాయుడు కండ్రిగ ఎస్టీ కాలనీ, బక్క పోతుగుంట బీసీ కాలనీ వాసులు ఎర్ర జెండాలు చేపట్టి ప్రభుత్వం భూమి లోకి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎ.రామానాయుడు అధ్వర్యంలో భూమిలో ఎర్ర జెండాలనుపాతి భూపోరాటం ప్రారంభించారు. ఆడ మగ పిల్లలు పెద్దలు వారి వెంట తెచ్చుకున్న కొడవళ్లతో చెట్లు కొట్టారు. ఈ సందర్భంగా ఆవుల శేఖర్‌ మాట్లాడుతూ పేదలకు ఇవ్వడానికి వెయ్యి ఎకరాల భూమి వుంది. అయినా ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో పేదలందరిని కలుపుకొని ఆక్రమించామనీ, దళిత గిరిజన, బీసీలకు సాగుభుములు దక్కేంత వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దేశంలో కోట్లాది ఎకరాల మిగులు భూమి వున్నా దళిత గిరిజన, బడుగు బలహీనర్గాలకు భూమి పంచకుండా పాలకుల మోసం చేస్తున్నారని శేఖర్‌ విమర్శించారు. రామానాయుడు మాట్లాడుతూ జిల్లాలో ఎర్రజెండా నాయకత్వాన అనేక గ్రామాల్లో భూములు పంచిన చరిత్ర సీపీఐకి ఉందని గుర్తు చేశారు. ఎక్కడైనా పేదవాడు భూములు కావాలని అడిగితే అక్కడకి అటవీ అధికారులు , రెవెన్యూ అధికారులు వచ్చి పేదలను భయపెట్టడం మామూలు అయిపోయిందన్నారు . కాళంగి ప్రాజెక్టుకు అనుకుని ఉన్న భూమి పారెస్ట్‌ భూమా, రెవెన్యూ భూమా తేల్చాలని రామానాయుడు డిమాండ్‌ చేశారు. పెంచలయ్య మాట్లాడుతూ భూపోరాటాలు ఎప్పుడూ ఒక్కరోజు తో విజయ సాధించలేదని , ప్రభుత్వాలపై నిత్యం ఒత్తిడి చేసి దళిత గిరిజనులకు భూములు సాధించే వరకు పోరాటం చేయాలన్నారు . అందులో భాగంగానే ఈ నెల 11న కేవీబీ పురం మండల తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట వందలాది మంది దళిత గిరిజనుల తో ధర్నా నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జనమాల గురవయ్య , సత్యవేడు ఏరియా కార్యదర్శి కత్తి రవి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జె తులసీ రాజన్‌, కత్తి ధర్మయ్య , మించల శివ కుమార్‌, పి.గురవయ్య, జేవీ చలపతి, రుద్రపాకు శ్రీనివాసులు , స్థానిక నాయకులు సురేష్‌, పి.మణి, తీరుపాల్‌, నాగూర్‌, వెంకటరమణ, రామన్న, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img