Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

చైనా..భారత్‌ సైనికుల మధ్య ఘర్షణ నేపథ్యంలో.. రాజ్‌నాథ్‌ సింగ్‌ అత్యున్నతస్థాయి సమావేశం

కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అత్యున్నతస్థాయి సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. చైనా – భారత్‌ సైనికుల మధ్య అరుణాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దుల్లో ఘర్షణ నేపథ్యంలో ఈ మీటింగ్‌ ని నిర్వహించారు. రక్షణ దళాల చీఫ్‌ (చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌) జనరల్‌ అనిల్‌ చౌహాన్‌, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోవల్‌, ఇతర ముఖ్య అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ నెల 9న అరుణాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దుల్లో తమాంగ్‌ వద్ద ఇరుదేశాల సైనికుల మధ్య దాడి జరిగింది. ఈ దాడిలో ఇరువైపుల సైనికులు గాయపడ్డారు. ఈ ఘటనపై ఈ రోజు మధ్యాహ్నం పార్లమెంటులో రక్షణ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ ప్రకటన చేయనున్నారు. దీనికంటే ముందు పరిస్థితిని క్షుణ్ణంగా తెలుసుకునేందుకు ఆయన సమీక్ష నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై పార్లమెంటులో చర్చకు పలు పార్టీలు పట్టుబడుతుండడం గమనార్హం. దీనిపై లోక్‌ సభలో వివరణ కోరుతూ ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సైతం నోటీసు జారీచేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img