Monday, June 5, 2023
Monday, June 5, 2023

జగన్‌, సజ్జల, పీకే కుట్రలో భాగమే
చంద్రబాబుపై దాడి

టీడీపీ నేతల ఆగ్రహం

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : యర్రగొండపాలెంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తుండగా వైసీపీ శ్రేణులు రాళ్లతో దాడి చేయడంపై టీడీపీ నేతలు మండిపడ్డారు. సీఎం జగన్‌రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రశాంత్‌ కిశోర్‌ కుట్రలో భాగంగానే శుక్రవారం యర్రగొండపాలెంలో చంద్రబాబుపై రాళ్ల దాడికి దిగారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, వర్ల రామయ్య, ఆనందబాబు, కేఎస్‌ జవహర్‌ తదితరులు ఆరోపించారు. చంద్రబాబు పర్యటనలపై వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని, దాడులకు పాల్పడే అవకాశం ఉందని ముందుగా తెలిసిన సమాచారం మేరకు కడప ఎస్పీకి, ప్రకాశం ఎస్పీకి, పల్నాడు జిల్లా ఎస్పీకి, డీజీపీకి లేఖ ద్వారా రాతపూర్వకంగా తెలియజేసినా, గొడవ జరిగే అవకాశం ఉందని డీజీపీకి ఫిర్యాదు చేసినా… దాడి జరిగిందంటే అది ముమ్మాటికీ పోలీసులు, అధికార పార్టీ నేతలు కలిసి చేసిన కుట్రేనని వారు విమర్శించారు. ప్రతిపక్ష నేతకు భద్రత కల్పించడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం జగన్‌ రెడ్డి కుట్రలో భాగమేనన్నారు. ఎన్‌ఎస్‌జీ కమాండోలపై కూడా రాళ్ల దాడికి దిగి, వారిని రెచ్చగొట్టి దళితులపై కాల్పులు జరిపేలా చేసి, తద్వారా తెలుగుదేశం పార్టీపై బురద జల్లేందుకు కుట్ర చేశారన్నారు. జగన్‌ రెడ్డి రోడ్డెక్కితే పరదాలు కట్టి, కందకాలు తవ్వి, రోడ్లపై బారికేడ్లు పెట్టి ప్రజల్ని కూడా రోడ్డెక్కనివ్వకుండా, ప్రతిపక్ష నేతల్ని గృహ నిర్బంధాలు చేసే పోలీసులు… రౌడీ మూకలు దాడి చేయడానికి వస్తుంటే అడ్డుకోకుండా వారికి అండగా నిలవడం వెనుక జగన్‌ రెడ్డి ఆదేశాలున్నాయన్నారు. చంద్రబాబు కాన్వాయ్‌ ఎటు నుండి వస్తుందో మంత్రి ఆదిమూలపు సురేష్‌ పోలీసుల్ని కనుక్కుంటున్న తీరు చూస్తుంటే దాడికి ముందుగానే ప్లాన్‌ చేసుకున్నారని అర్ధమవుతోందని, మంత్రిగా ఉన్న వ్యక్తి వీధి రౌడీలా చొక్కా విప్పి రోడ్డుపై హల్‌చల్‌ చేయడం దుర్మార్గమన్నారు. జెడ్‌ ప్లస్‌ భద్రత కలిగిన ప్రతిపక్ష నాయకుడి పర్యటనకు భద్రత కల్పించాల్సింది పోయి, పాలకుల ఆదేశానుసారం దాడులు చేసే వారికి రెడ్‌ కార్పెట్‌ వేయడం ప్రజాస్వామ్యాన్ని హరించడమే నన్నారు. వివేకా హత్య కేసు, కోడికత్తి కేసుల్లో జగన్‌ రెడ్డి మెడకు ఉచ్చు బిగుసుకుంటోందని, ఆ భయంతో ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో ఇలా ప్రతిపక్ష నాయకుడిపై రౌడీ మూకలతో దాడులు చేయిస్తున్నారన్నారు. వైసీపీ కుట్ర, దాడి, పోలీసు వైఫల్యాలపై గవర్నర్‌ తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.
మంత్రి సురేష్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి: ఎంపీ కనకమేడల
టీడీపీ అధినేత చంద్రబాబుపై దాడికి పాల్పడిన మంత్రి ఆదిమూలపు సురేష్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ డిమాండ్‌ చేశారు. దాడి వెనుక రాజకీయ కుట్ర ఉందన్నారు. మంత్రి సురేష్‌ వైఖరి సభ్యసమాజం తలదించుకునేలా ఉందని, ఘర్షణ వాతావరణం ఉన్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారన్నారు. మంత్రి హోదాలో సురేష్‌ పోలీసులకు ఆదేశాలివ్వడంతో వారు చోద్యం చూసే పరిస్థితి ఏర్పడిరదని, చంద్రబాబుని కాపాడేందుకు కమాండోలు బుల్లెట్‌ ఫ్రూప్‌ జాకెట్లను అడ్డుపెట్టాల్సి వచ్చిందని చెప్పారు. ఒక కమాండో గాయపడ్డారని, కరెంట్‌ కూడా తీసేశారన్నారు. అయినప్పటికీ ఇంతవరకు ఒక్క కేసు కూడా నమోదు చేయకపోవడం దారుణమని కనకమేడల అన్నారు.
కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఫిర్యాదు
ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుపై దాడిలో పోలీసులు 151 సీఆర్‌పీసీని దుర్వినియోగం చేశారని, వీఐపీ భద్రతకు సంబంధించి పోలీసు స్టాండిరగ్‌ ఆర్డర్‌లను ఉల్లంఘించడం వంటి చర్యలపై కేంద్ర హోం మంత్రి అజయ్‌కుమార్‌ భల్లాకు హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశారు. ప్రజా స్ఫూర్తి గల వ్యక్తిగా, న్యాయవాదిగా, చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, ఏపీలో జరుగుతునÊ కొన్ని చట్టవిరుద్ధమైన పద్ధతులను మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నానని తెలియజేస్తూ ఘటనలో జరిగిన చట్ట ఉల్లంఘనలన్నింటినీ లేఖలో వివరించారు. చంద్రబాబుపై గూండాలు రాళ్లు రువ్వుతున్న వీడియో క్లిప్‌ను కూడా లేఖకు జత చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img