Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్లు..ఆరుగురు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌లో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌ (జేఎం)కి చెందిన ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు పోలీసు అధికారులు వెల్లడిరచారు. మృతుల్లో ఇద్దరు పాకిస్తాన్‌ జాతీయులు కూడా ఉన్నట్లు తెలిపారు. ‘రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో జైషే మహమ్మద్‌కు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. వారిలో ఇద్దరు పాకిస్తాన్‌కు చెందినవారిగా గుర్తించాం. మరో ఇద్దరు స్థానిక ఉగ్రవాదులు. ఇది మాకు పెద్ద విజయం’ అని ఓ పోలీసు అధికారి వెల్లడిరచారు.
అనంతనాగ్‌, కుల్గాం జిఆల్లలో నిన్న సాయంత్రం భద్రతా బలగాలు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌ను ప్రారంభించాయి. ఇరువర్గాల మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగిందని కశ్మీర్‌ పోలీసులు ట్వీట్‌ చేశారు. కుల్గాం ప్రాంతంలో మరో ఉగ్రవాది ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఎన్‌కౌంటర్లలో పోలీసు సిబ్బంది ఒకరు గాయపడ్డారు. ఆర్మీ ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతోంది. ఒక ఎం4, రెండు ఏకే 47 రైఫిళ్లు స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img