Friday, December 1, 2023
Friday, December 1, 2023

జర్నలిస్టులపై తాలిబన్ల దాష్టీకం..

మహిళల నిరసనలు కవర్‌ చేశారని.. విచక్షణారహితంగా దాడి
అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్ల అరాచకాలు రోజురోజుకూ పెచ్చుమీరుతున్నాయి. ఇప్పటికే స్వేచ్ఛ కోసం మహిళలు చేపడుతున్న ఆందోళనను అణచివేస్తున్న తాలిబన్లు..ఆ ఆందోళలను కవర్‌చేసిన జర్నలిస్టులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఇద్దరు జర్నలిస్టులను బంధించి తీవ్రహింసకు గురిచేశారు. బట్టలు విప్పి రక్తం వచ్చేలా చావబాదారు. తాలిబన్ల దాడిలో తీవ్రంగా గాయపడిన కొందరు జర్నలిస్టుల ఫొటోలు తాజాగా సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.పశ్చిమ కాబుల్‌లోని కర్తే ఛార్‌ ప్రాంతంలో తాలిబన్లకు వ్యతిరేకంగా కొందరు మహిళలు బుధవారం ఆందోళన చేపట్టారు.ఈ ఆందోళనను అడ్డుకున్న తాలిబన్లు దీన్ని కవర్‌ చేస్తున్న జర్నలిస్టుల పౖౖెనా దాడులకు పాల్పడ్డారు.ఆఫ్గాన్‌ మీడియా సంస్థ ఎట్లియాట్రోజ్‌కు చెందిన వీడియో ఎడిటర్‌ తాఖీ దర్యాబీ, రిపోర్టర్‌ నెమతుల్లా నక్దీలను తాలిబన్లు తీసుకెళ్లి బంధించి.. చిత్రహింసలకు గురిచేశారని సదరు మీడియా సంస్థ వెల్లడిరచింది. ఆ తర్వాత కొంతసేపటికి వారిని విడిచిపెట్టినట్లు పేర్కొంది. గాయాలతో ఉన్న జర్నలిస్టుల ఫొటోలను ఆ సంస్థ ట్విటర్‌ వేదికగా విడుదల చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img