జార్ఖండ్‌లోని ధన్‌బాద్ అదనపు జిల్లా జడ్జి ఉత్తమ్ ఆనంద్ మృతి కేసుపై సుప్రీంకోర్టు స్పందించింది. జడ్జి ఉత్తమ్ ఆనంద్ హత్యకు గురైనట్లు వచ్చిన ఆరోపణలపై స్వీయ విచారణ జరపాలని సుప్రీంకోర్టు శుక్రవారం నిర్ణయించింది.ఘటనపై వారంలోగా సవివరమైన నివేదికలను సమర్పించాలని జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా జార్ఖండ్ ఏజీని వచ్చేవారం విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. కాగా ధన్‌బాద్‌లో జడ్జి ఉత్తమ్ ఆనంద్ తన నివాసం నుంచి బుధవారం ఉదయం వాకింగ్‌కు వెళ్ళారు. ఆ సమయంలో దుండగులు ఆటోతో ఢీకొట్టడంతో ఆయన మృతిచెందిన విషయం తెలిసిందే. ఉత్తమ్ ఆనంద్ వాకింగ్ చేస్తుండగా ఓ ఆటో ఢీకొట్టినట్లు కనిపిస్తున్న సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా ధన్‌బాద్ పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో సీజేఐ జస్టిస్ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును స్వీయ విచారణకు చేపట్టింది.