Friday, February 3, 2023
Friday, February 3, 2023

జీవో నంబరు ఒకటిని దహనం చేయండి

రాజకీయ పార్టీలకు రామకృష్ణ పిలుపు

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: ప్రజాస్వామిక హక్కులను కాలరాసే జీవో నంబరు 1 ప్రతులను శనివారం భోగి మంటల్లో దహనం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలకు పిలుపునిచ్చారు. పార్లమెంటు చేసిన చట్టాలను సమీక్షించే అధికారం సుప్రీంకోర్టుకు లేదంటూ రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్కర్‌ చెప్పడం తగదని రామకృష్ణ వ్యాఖ్యానించారు. ధన్కర్‌ వ్యాఖ్యలు న్యాయవ్యవస్థను కించపరచడమేనని, రాబోయే రోజుల్లో పార్లమెంటుకు, న్యాయవ్యవస్థకు మధ్య ఘర్షణ సృష్టించడానికి పాలకులు కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. రామకృష్ణ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లోనూ ప్రజాస్వామ్య హక్కులను కాలరాసేలా పాలన కొనసాగుతోందని విమర్శించారు. గత సంప్రదాయాలకు భిన్నంగా జగన్‌ ప్రభుత్వం జీవో నంబరు1 జారీజేసి…ప్రతిపక్షాలను, ప్రజాసంఘాల ప్రజాస్వామ్య హక్కులను కాలరాసేందుకు ప్రయత్నించిందని ధ్వజమెత్తారు. జీవో నంబరు`1ని రద్దు చేయాలని తాను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో పిటిషన్‌ వేస్తే…దానిని విచారణకు రాకుండా చేయడానికి ప్రభుత్వం ప్రయత్నించిందని గుర్తుచేశారు. విచారణ అధికారిగా ఉన్న న్యాయమూర్తిని కించపరుస్తూ…ఆయనపై వ్యాఖ్యలు చేసే స్థితికి రాష్ట్ర ప్రభుత్వం దిగజారిందన్నారు. జడ్జిమెంటు పూర్తయ్యాక, ఆ న్యాయమూర్తికి రెండు పోలీసు వాహనాల్లో భద్రత కల్పించారంటే…ప్రస్తుతం రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏ రకంగా ఉన్నాయో అర్థమవుతోందని రామకృష్ణ అన్నారు. అరాచకశక్తులు న్యాయవ్యవస్థపైనా దాడికి సాహసిస్తున్నాయని విమర్శించారు. రాజ్యాంగం ప్రకారం న్యాయవ్యవస్థకు గల స్వయంప్రతిపత్తిని కాలరాసేలా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం జారీజేసిన జీవో`1ను భోగి మంటల్లో తగలబెట్టాలని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలకు రామకృష్ణ విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img