Tuesday, December 6, 2022
Tuesday, December 6, 2022

టిడ్కో ఇళ్లు తక్షణం ఇవ్వాలి

రామకృష్ణ డిమాండు
టిడ్కో ఇళ్లను పరిశీలించిన సీపీఐ బృందాలు

ఏలూరు : సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్ణయంలో భాగంగా బుధవారం రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పార్టీ నాయకులు బృందాలుగా టిడ్కో ఇళ్ల నిర్మాణా లను పరిశీలించింది. సత్వరమే ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని, లబ్ధిదారులకు అందజేయాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని నాయకులు డిమాండు చేశారు. లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏలూరులో రామకృష్ణ, విజయవాడలో ముప్పాళ్ల నాగేశ్వరరావు, శ్రీకాళహస్తిలో పి.హరినాథరెడ్డి, అనంతపురంలో జగదీశ్‌ నాయకత్వంలో టిడ్కో ఇళ్ల పరిశీలన జరిగింది. టిడ్కో ఇళ్లను తక్షణమే లబ్ధిదారులకు అందజేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కార్పొరేషన్‌ పరిధిలోగల పోనంగిలో నిర్మించిన టిడ్కోఇళ్లను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ టిడ్కోఇళ్ల నిర్మాణ పరిస్థితులు, మౌలిక వసతుల కల్పనపై రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ బృందాలు పరిశీలిస్తున్నాయన్నారు. ఫిబ్రవరిలో తాము నిర్వహించిన ఉద్యమాల ఫలితంగా ప్రభుత్వంలో కదలిక వచ్చిందని గుర్తు చేశారు. అప్పటికప్పుడు హడావుడిగా మున్సిపల్‌ కమిషనర్లు, అధికార యంత్రాంగం లబ్ధిదారుల జాబితాను ఖరారు చేసి అర్హత పత్రాలు ఇచ్చి10 రోజుల లోపు గృహప్రవేశాలు చేయించి స్వాధీనం చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటన చేశారని తెలిపారు. కానీ ఆరు నెలలు అది అమలు కాలేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో 80 శాతం నిర్మాణం పూర్తయినా మిగిలిన మౌలిక సదుపాయాలు కల్పించడంలో జగన్‌ ప్రభుత్వ విఫలమైందని ఆరోపించారు. టిడ్కో ఇళ్లను ప్రభుత్వ ధనంతో నిర్మించారని, ఏ ఒక్కరి సొమ్ముతోనో కాదని గుర్తుచేశారు. సీఎం నిరంకుశ వైఖరి వలన కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అయిందని ఆరోపించారు. టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు 10 రోజుల లోపు స్వాధీనం చేయాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే కలిసి వచ్చే పార్టీలతో ఈనెల 22 నుండి ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని హెచ్చరించారు. లబ్ధిదారులకు న్యాయం జరిగే వరకు సీపీఐ పోరాటం చేస్తోందన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్‌ మాట్లాడుతూ ఫిబ్రవరిలో గృహప్రవేశాలకు లబ్ధిదారులను సిద్ధం చేస్తున్న తరుణంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని ఇళ్లు అప్పగిస్తామని హామీ ఇచ్చిందన్నారు. సీపీఐ జిల్లా సమితి సభ్యులు పుప్పాల కన్నబాబు, బాడిస రాము, తుర్లపాటి బాబు, పొటేలు పెంటయ్య, పాల రామకృష్ణ, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు మహంకాళి సుబ్బారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి టి.అప్పలస్వామి, లబ్ధిదారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img