Wednesday, November 30, 2022
Wednesday, November 30, 2022

డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక.. నాలుగు దగ్గు సిరప్‌లపై విచారణ

ఆఫ్రికా దేశం గాంబియాలో దగ్గు సిరప్‌ తాగిన 66 మంది చిన్నారులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో హర్యానాలో ఉన్న ఫార్మసీ కంపెనీకి చెందిన నాలుగు రకాలు దగ్గు సిరప్‌(%జశీబస్త్రష్ట్ర ూవతీబజూం% )లపై భారత ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దగ్గు సిరప్‌ల గురించి డీసీజీఐకి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫిర్యాదు చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. సెప్టెంబర్‌ 29వ తేదీన ఈ ఫిర్యాదు అందింది. అయితే ఈ అంశాన్ని తక్షణమే హర్యానా రెగ్యులేటరీ సంస్థతో డీసీజీఐ సంప్రదించింది. ఆ వెంటనే దగ్గు సిరప్‌లపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img