Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

డ్రగ్స్‌ వ్యాపారంలో సమీర్‌ వాంఖడే మరదలి ప్రమేయం..?

మరోసారి ఆరోపణలు చేసిన మంత్రి నవాబ్‌ మాలిక్‌
మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్‌సీబీ) ముంబై జోనల్‌ డైరక్టర్‌ సమీర్‌ వాంఖడేపై మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ తన ఆరోపణల పర్వాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. సోమవారం ఆయన కొత్త ఆరోపణలు చేశారు. ఎన్సీబీ అధికారి సమీర్‌ వాంఖడే మరదలు హర్షదా దీనానాద్‌ రెడ్కర్‌కు డ్రగ్‌ వ్యాపారంలో ప్రమేయం ఉందన్న ఆయన ఎన్‌సీపీ అధికారి సమాధానం చెప్పాలని డిమాండు చేశారు. నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్సెస్‌ యాక్ట్‌ అక్రమ రవాణా నిరోధక చట్టం కింద 2008లో నమోదైన కేసులో సమీర్‌ మరదలు హర్షదా దీనానాథ్‌ రెడ్కర్‌ జాబితా చేయబడినట్లు రుజువుని మంతి చూపించారు.‘‘సమీర్‌ దావూద్‌ వాంఖడే… మీ మరదలు హర్షదా దీనానాథ్‌ రెడ్కర్‌ డ్రగ్స్‌ వ్యాపారంలో పాలుపంచుకున్నారా? ఎందుకంటే ఆమె కేసు పూణే కోర్టులో పెండిరగ్‌లో ఉన్నందున మీరు సమాధానం చెప్పాలి.’’ అని మంత్రి నవాబ్‌ ట్వీట్‌ చేశారు. అయితే ఈ ఆరోపణలను సమీర్‌ వాంఖడే తోసిపుచ్చారు. జనవరి 2008లో తన మరదలు కేసు జరిగినప్పుడు తాను సర్వీసులో కూడా లేనని సమీర్‌ చెప్పారు. తాను 2017లో క్రాంతి రెడ్కర్‌ను మాత్రమే వివాహం చేసుకున్నానని, తనకు మరదలు హర్షదా దీనానాథ్‌ రెడ్కర్‌ తో ఏ విధంగా సంబంధం ఉందని ప్రశ్నించారు. ఇదిలాఉండగా సమీర్‌ వాంఖడే తండ్రి ధ్యాన్‌దేవ్‌ కచ్రూజీ వాంఖడే నవాబ్‌ మాలిక్‌పై బాంబే హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. తమ మత విశ్వాసాలను అవమానిస్తూ మాలిక్‌ ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. .తన కుటుంబసభ్యుల గురించి మీడియాలో మాట్లాడకుండా నవాబ్‌ మాలిక్‌ను నిరోధించాలని ధ్యాన్‌ దేవ్‌ మాలిక్‌ కోర్టును అభ్యర్థించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img