దేశంలో కొత్తగా 83,876 పాజిటివ్ కేసులు
దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత కొద్దిరోజులుగా కొత్త కేసులు తగ్గుముఖంపడుతుండగా తాజాగా లక్ష దిగువకు చేరాయి. 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 11,56,363 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా, 83,876 మందికి పాజిటివ్‌గా తేలింది. కరోనా నుంచి నిన్న 1,99,054 మంది కోలుకున్నారు.అలాగే, కరోనా వల్ల నిన్న 895 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 11,08,938 మంది చికిత్స తీసుకుంటున్నారు. మొత్తం మృతుల సంఖ్య 5,02,874కు పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు 7.25 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 1,69,63,80,755 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు.