Thursday, February 2, 2023
Thursday, February 2, 2023

తాలిబన్లపై తిరుగుబాటు!

తాలిబన్లను పెంచిపోషించిన అమెరికా అఫ్గానిస్తాన్‌ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోవడంతో.. సెకన్ల వ్యవధిలో పరిస్థితులు తారుమారయ్యాయి. తాలిబన్లకు వ్యతిరేకంగా అఫ్గాన్‌ ప్రజల ఆందోళనలు మిన్నంటాయి. నిరసనల సెగతో దేశంలోని వివిధ ప్రాంతాలు అట్టుడుకుతున్నాయి. అఫ్గాన్‌ జెండా ఎగరవేసిన వారిపై కాల్పులు జరిపారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తాలిబన్లు అధికారం చేపట్టడంపై అంతర్జాతీయ సమాజంలో భిన్న వాదనలు చోటుచేసుకుంటున్నాయి. లక్షలాది మంది క్షతగాత్రులు,శరణార్థులను చేసిన సుదీర్ఘ యుద్ధంలో అఫ్గాన్‌లో బలైపోయింది చిన్నారులు.. మహిళలే..ఆటవిక సంస్కృతికి నిలయమైన తాలిబన్లు మళ్లీ దేశాన్ని కబళించడంతో ప్రజలు భయంతో విమాన రెక్కలు పట్టుకుని వేరే దేశాలకు తరలివెళుతున్న దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. అక్కడి ఉగ్రవాదం తమ దేశాల్లోకి పాకుతుందని అంతర్జాతీయ సమాజం ఉలిక్కి పడుతోంది. తాలిబన్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని చైనా రక్షణ సిబ్బందిని హెచ్చరించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img