Thursday, September 29, 2022
Thursday, September 29, 2022

తాలిబాన్ల సంబరాల్లో 17 మంది మృతి

పంజ్‌షీర్‌ వశమైందన్న వార్తలతో తాలిబాన్లు సంబరాల్లో మునిగిపోయారు. కాబూల్‌లో గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పలువురు చిన్నారులు సహా 17 మంది ప్రాణాలు కోల్పోగా 41 మంది తీవ్రంగా గాయపడినట్టు ఆఫ్ఘనిస్థాన్‌ న్యూస్‌ ఏజెన్సీ అశ్వక తెలిపింది. ఇన్నాళ్లు కొరకరాని కొయ్యగా మారిన పంజ్‌షీర్‌ వ్యాలీని తమ అదుపులోకి తెచ్చుకోవడం, నేషనల్‌ రెసిస్టెన్స్‌ ఫోర్స్‌ ఆఫ్‌ ఆఫ్ఘనిస్థాన్‌ (ఎన్‌ఆర్‌ఎఫ్‌ఏ)ను ఓడిరచడంతో సంబరాలు చేసుకున్న తాలిబన్లు ఆ ఆనందంలో గత రాత్రి గాల్లోకి కాల్పులు జరిపారు. ఇందుకు సంబంధించి వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.
అమెరికా బలగాల ఉపసంహరణ తర్వాత తాలిబాన్లు అఫ్ఘాన్‌ మొత్తాన్ని ఆక్రమించుకున్నారు.కానీ ఒక్క పంజ్‌షీర్‌ తప్ప. కాబూల్‌కు ఉత్తరాన దాదాపు 150 కి.మీ.దూరంలో ఉన్న పంజ్‌షీర్‌ ప్రావిన్సు దశాబ్దాల నుంచి తాలిబాన్లకు కొరకరాని కొయ్యే. ఈ ప్రాంతాన్ని ఎలాగైనాసరే ఆక్రమించుకోవాలని తాలిబన్లు ప్రయత్నించారు. పంజ్‌షీర్‌పౖౖె ఇటీవల దాడికి కూడా దిగారు. ఎదురుదెబ్బ తగిలి దాదాపు 350 మంది తాలిబన్‌ ముఠా సభ్యులు ప్రాణాలొదిలారు. తాజాగా ఈ ప్రాంతం కూడా తమ వశమైనట్లు తాలిబాన్‌ వర్గాలు వెల్లడిరచాయి. అయితే తాలిబాన్ల ప్రకటనను ఉత్తర కూటమి సేనలు ఖండిస్తున్నాయి. పంజ్‌షీర్‌ ఇంకా తమ అధీనంలోనే ఉందని చెబుతున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img