పట్టాదారులకు థర్డ్‌పార్టీ హక్కు ఉండబోదు
ఆర్`5 జోన్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
విశాలాంధ్ర బ్యూరో - అమరావతి: అమరావతి రాజధాని ఆర్
5జోన్‌లో పేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇస్తే అది తుది తీర్పునకు లోబడి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏపీ హైకోర్టులో పెండిరగ్‌లో ఉన్న రిట్ పిటిషన్ తీర్పునకు లోబడే పట్టాల చెల్లుబాటు ఉంటుందని తేల్చిచెప్పింది. పట్టాదారులకు థర్డ్‌పార్టీ హక్కు ఉండబోదని ఉద్ఘాటించింది. ఆర్5 జోన్‌పై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. గతంలో ఆర్
5 జోన్‌పై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను అమరావతి రైతులు సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. రైతుల తరపున సీనియర్ న్యాయవాదులు రంజిత్ కుమార్, శ్యాందివాన్ వాదించారు. అటు రాష్ట్ర ప్రభుత్వం కేవియట్ దాఖలు చేసింది. ఆర్` 5 జోన్‌లోనే పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీఆర్డీయే చట్టంలో ఉందని శ్యాందివాన్ గుర్తు చేశారు. ఎలక్ట్రానిక్ సిటీలో ఇళ్ల స్థలాల కేటాయింపు వల్ల రాజధాని రూపురేఖలు మారిపోతాయని ఆయన అన్నారు. ఇటు ఆర్థిక వృద్ధికి, ప్రగతికి అవరోధం ఏర్పడడమే కాకుండా రైతులకు తీరని నష్టం కలుగుతుందని శ్యాందివాన్ వాదించారు. రాజధాని మాస్టర్ ప్లాన్ ప్రకారం అధికారులు వెళ్లి అభివృద్ధిపై ప్రచారం చేశారన్నారు. మాస్టర్ ప్లాన్‌లో నవనగరాలు ప్రతిపాదించారని, అవి అభివృద్ధి చెందితే ఎన్నో అవకాశాలు వస్తాయన్నారు. ఆర్థిక కార్యకలాపాలు పెరిగి రాజధాని రూపురేఖలు మారతాయన్నారు. అలాగే పేదల కోసం కూడా 5శాతం భూములు ఇవ్వాలని ఉందని, అయితే అవి రెసిడెన్షియల్ జోన్ల నిబంధనల ప్రకారం కేటాయింపులు ఉండాలన్నారు. నవ నగరాల్లోని ప్రతి నగరంలో రెసిడెన్షియల్ జోన్ ఉందన్నారు. రైతులతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు పాలకులు మారినప్పుడల్లా అమలు చేయకుండా పక్కన పెట్టలేరన్నారు. ఏపీ ప్రభుత్వం కోర్టు తీర్పులకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తోందని గట్టిగా వాదించారు. స్థల కేటాయింపు… అమరావతి కేసులో సుప్రీం కోర్టు ఇచ్చే తుది తీర్పుకు లోబడే ఉంటుందని న్యాయస్థానం పేర్కొంది. ఒకవేళ తుది తీర్పుకు వ్యతిరేకంగా వస్తే పట్టాలు చెల్లుబాటు కావనే విధంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. పట్టాలు పంపిణీ చేసినా లబ్ధిదారుల హక్కులు కోర్టు తీర్పుకు లోబడే ఉంటాయని, లబ్ధిదారులు వేరే వాళ్లకు విక్రయించకూడదని న్యాయస్థానం స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో ఈ మేరకు సుప్రీంకోర్టు సవరణ చేసింది. ఆర్5జోన్‌లో ఇప్పటికే ప్లాట్ల కేటాయింపులు జరిగాయని ప్రభుత్వ తరపు న్యాయవాది అభిషేక్ సింఫ్వీు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. 2023 మార్చి 21న ఏపీ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ నోటిఫికేషన్ ఇచ్చిందని, మొత్తం 34వేల ఎకరాల్లో కేవలం 900 ఎకరాలే ఈడబ్ల్యూఎస్‌కు కేటాయించిందని కోర్టుకి తెలిపారు. సుప్రీంకోర్టులో ఆర్
5జోన్‌పై ఉన్న కేసులన్నీ వ్యక్తిగతంగా వేసినవేనని, వాటిలో ఒక్కటి కూడా ప్రజా ప్రయోజనం వ్యాజ్యం లేదన్నారు. ఆర్5జోన్‌లో ఇప్పటికే ప్లాట్ల కేటాయింపు పూర్తయిందని, కావాలంటే ఈ
సిటీకి మరో 900 ఎకరాలు కేటాయించుకోవచ్చని తెలిపారు. పాట్ల కేటాయింపుపై అభ్యంతరం చెప్పబోమన్న అత్యున్నత న్యాయస్థానం… మూడు రాజధానులపై హైకోర్టు రిట్ పిటిషన్ తీర్పునకు లోబడే పట్టాల చెల్లుబాటు ఉంటుందని స్పష్టం చేసింది.