Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

తుపాను ముప్పు

. 6న వాయుగుండం… 8 నాటికి అల్పపీడనం
. క్రమంగా తుపానుగా మారే అవకాశం
. ఇప్పటికే రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న అకాల వర్షాలు

విశాలాంధ్ర బ్యూరో – విశాఖపట్నం : బంగాళాఖాతంలో తుపాను ఏర్పడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం వెల్లడిరచింది. 6వ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని, ఇది 8న అదే ప్రాంతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని, క్రమంగా బలపడి తుపానుగా రూపాంతరం చెందుతుందని వాతావరణ విభాగం అధికారులు వివరించారు. ఎండలు మండిపోయే నడి వేసవిలోనూ అప్పుడప్పుడు తుపానులు సంభవిస్తుండటం తెలిసిందే. అయితే ఈ తుపాను పయనం ఎటువైపు, దీని ప్రభావం ఏ రాష్ట్రాలపై ఉంటుందన్నది ఇంకా స్పష్టత రాలేదని అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే గత కొన్ని రోజులుగా విస్తారంగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురిశాయి. భానుడి భగభగల నుంచి సామాన్యుడికి ఊరట కలుగుతున్నప్పటికీ, రైతులకు మాత్రం తీవ్ర నష్టం వాటిల్లుతోంది. అనేక ప్రాంతాల్లో పంటలు తడిసి పాడైపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రైతులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో రుతుపవనాల సీజన్‌ తరహాలో కుండపోత వానలు కురుస్తున్నాయి. సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు ద్రోణి/ గాలి కోత నైరుతి మధ్యప్రదేశ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు మరఠ్వాడా, అంతర్గత కర్నాటక మీదుగా కొనసాగుతోంది. ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కి.మీ ఎత్తులో దక్షిణ చత్తీస్‌గఢ్‌ పరిసరాల్లో ఉండి కొనసాగుతున్నది. సముద్ర మట్టానికి 3.1 కి.మీ, 5.8 కి.మీ మధ్య దక్షిణ అంతర్గత కర్నాటక తమిళనాడుకు ఆనుకుని ఉన్న ఉపరితల ఆవర్తనము ఇప్పుడు ఉత్తర తమిళనాడు, పొరుగు వరకు ఉండి కొనసాగుతున్నది. 6వ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో 7న అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఇది 8న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉందన్నారు. ఆ తర్వాత, దాదాపు ఉత్తర దిశగా మధ్య బంగాళాఖాతం వైపు కదిలి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని, పైన తెలిపిన ఉపరితల ఆవర్తనము నుంచి ఉత్తర శ్రీలంక తీరంలో 1.5 కి.మీ`3.1 కి.మీ మధ్య దక్షిణ అంతర్గత కర్నాటక, దానిని ఆనుకుని ఉన్న తమిళనాడు నైరుతి బంగాళాఖాతం వరకు ఉందని, అయితే ఇప్పుడు తక్కువగా గుర్తించబడిరదని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img