Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

తూచా తప్పకుండా కరోనా నిబంధనలు పాటించాలి


ప్రధాని మోదీ
కరోనా మహమ్మారి అనేక రూపాలు సంతరించుకుంటున్నదని, మనం వాటిపై ఓ కన్నేయాలని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. కరోనా వేయింట్లపై నిపుణులు అధ్యయనం చేస్తున్నారని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల్లోని కొండ ప్రాంతాలకు వచ్చే పర్యాటకులు కరోనా నిబంధనలను సరిగా పాటించడంలేదని, ఇది ఆందోళనకరమైన విషయమని వ్యాఖ్యానించారు. హిల్‌స్టేషన్‌కు వచ్చే పర్యాటకుల్లో చాలామంది మాస్కు ధరించడం లేదని, భౌతికదూరం కూడా పాటించడం లేదన్నారు. మాస్కులు లేకుండా జనం భారీ సంఖ్యలో గుమిగూడటం మంచిది కాదన్నారు. ప్రజలు తూచా తప్పకుండా కరోనా నిబంధనలు ప్రజలు పాటించేలా ప్రోత్సహించాలని ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img