Tuesday, June 6, 2023
Tuesday, June 6, 2023

తెలుగు రాష్ట్రాల్లో ఐటీ సోదాలు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని కళామందిర్ షాపులు, డైరెక్టర్ల ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఒక్క హైదరాబాద్ లోనే 40 చోట్ల ఏకకాలంలో దాడులు చేసినట్లు తెలుస్తోంది. మంగళవారం ఉదయం ఆరు గంటలకే కళామందిర్ డైరెక్టర్లు శిరీష చింతపల్లి, ప్రమోద్‌ ఇళ్లకు అధికారులు చేరుకున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖ షాపుల్లోనూ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img