Thursday, February 2, 2023
Thursday, February 2, 2023

త్వరలో కొత్త పార్టీ పెడుతున్నా… : అమరీందర్‌ సింగ్‌


త్వరలోనే కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ బుధవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ప్రకటించారు. ఎన్నికల సంఘం నుంచి అనుమతులు రాగానే పార్టీ పేరును, గుర్తును కూడా ప్రకటిస్తానని కెప్టెన్‌ చెప్పారు. తన న్యాయవాదులు ఆ పనిలో నిమగ్నమై ఉన్నారని అమరిందర్‌ సింగ్‌ తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నవ్‌జోత్‌ సింగ్‌ సిద్ధు ఎక్కడి నుంచి పోటీ చేసినా.. తాము కూడా అక్కడి నుంచి పోటీ చేస్తామని స్పష్టంచేశారు. తన కొత్త పార్టీలో చేరేందుకు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన చాలా మంది సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. సమయం వస్తే మొత్తం 117 సీట్లలో కూడా తమ పార్టీ సొంతంగా పోటీ చేస్తుందని వెల్లడిరచారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని చిత్తుగా ఓడిరచేందుకు ఐక్య కూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తానని వెల్లడిరచారు. పొత్తులకు సంబంధించి ఇతర పార్టీలతో చర్చలు జరగాల్సి ఉందని తెలిపారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు పలువురు కేంద్ర మంత్రులను కూడా కలవనున్నట్లు తెలిపారు. కేంద్రంతో కలిసి పనిచేయకపోతే రాష్ట్రం పెద్దగా చేయగలిగింది ఏమీ ఉండదని అభిప్రాయపడ్డారు. పంజాబ్‌ సరిహద్దులో బీఎస్‌ఎఫ్‌ దళాల అధికార పరిధిని 50 కి.మీల దూరం వరకు విస్తృతం చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని అమరీందర్‌ సింగ్‌ సమర్థించారు. రాష్ట్ర భద్రతకు ఈ నిర్ణయం దోహదపడుతుందని వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img